స్ట్రోక్‌ మందు... ఇక ల్యాబుల్లోనే!

హెపారిన్‌... శరీరంలో రక్తం గడ్డకట్టకుండా అడ్డుకునే మందు. పక్షవాతం వచ్చినప్పుడో, బైపాస్‌లాంటి సర్జరీలు చేస్తున్నప్పుడో ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు దీన్నే వాడుతుంటారు.

Published : 30 Mar 2024 23:52 IST

హెపారిన్‌... శరీరంలో రక్తం గడ్డకట్టకుండా అడ్డుకునే మందు. పక్షవాతం వచ్చినప్పుడో, బైపాస్‌లాంటి సర్జరీలు చేస్తున్నప్పుడో ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు దీన్నే వాడుతుంటారు. రోజురోజుకీ దీని వాడకం పెరగడం వల్ల- ఉత్పత్తి కూడా పెరగాల్సిన అవసరం ఉంటోంది. కాకపోతే, ఆ డిమాండు మేరకు ప్రపంచంలో పందుల సంఖ్య లేదు. మామూలుగా జంతువుల నుంచి తీసే ఏ మందు విషయంలోనైనా- సంబంధిత జంతువుల్ని ప్రత్యేకంగా ల్యాబుల్లోనే పెంచాలి. హెపారిన్‌ కొరత కారణంగా మామూలు ఫారమ్‌లో ఉన్న పందుల్నీ ఇందుకోసం తీసుకోవచ్చని ప్రభుత్వాలు అనుమతులిస్తున్నాయి. కానీ- ఆ పందులతో చేసిన మందుల వల్ల ఇన్ఫెక్షన్స్‌ పెరుగుతున్నాయి. దాంతో దీన్ని ల్యాబుల్లోనే తయారుచేసేందుకు ప్రయోగాలు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా అందులో విజయం సాధించారు పరిశోధకులు. ఇప్పటిదాకా ఈ మందుల్లో వాడే సహజ చక్కెర్ల గొలుసు అమరికను(షుగర్‌ చైన్స్‌) రూపొందించడం క్లిష్టంగా ఉండేదట. ఆ సమస్యని అమెరికాలోని ఉటా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా ఛేదించి విజయవంతంగా హెపారిన్‌ను తయారుచేయగలిగారు. పక్షవాతం, గుండెపోటు, సర్జరీల చికిత్సకి సంబంధించి ఇదో పెద్ద ముందడుగని చెబుతున్నారు. త్వరలోనే ఫార్మాకంపెనీలు వీటిని ఉపయోగంలోకి తీసుకురాబోతున్నాయట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు