పెద్దవాళ్ళలో వ్యాధులు రాకుండా...

వయసయ్యేకొద్దీ వ్యాధులు పెరుగుతుంటాయి. హృద్రోగాలు, బీపీ, షుగర్‌ వంటివి చుట్టుముడుతుంటాయి. ‘వృద్ధాప్యంలో ఇవన్నీ మామూలే’ అని సామాన్యులు అనుకోవచ్చు కానీ శాస్త్రవేత్తలు అలా ఊరుకోరుగా! దాని మూలాలు వెతికారు .

Published : 14 Apr 2024 00:17 IST

వయసయ్యేకొద్దీ వ్యాధులు పెరుగుతుంటాయి. హృద్రోగాలు, బీపీ, షుగర్‌ వంటివి చుట్టుముడుతుంటాయి. ‘వృద్ధాప్యంలో ఇవన్నీ మామూలే’ అని సామాన్యులు అనుకోవచ్చు కానీ శాస్త్రవేత్తలు అలా ఊరుకోరుగా! దాని మూలాలు వెతికారు. మూలకణాల్లోనే సమస్య ఉందని తేల్చారు. వ్యాధులపైన పోరాటానికి కావాల్సిన తెల్లరక్తకణాలూ, టీ-సెల్స్‌ వంటివాటిని మూలకణాలే తయారుచేస్తుంటాయి. కానీ- నడివయసు దాకా బాగా పనిచేసే ఈ మూలకణాలు- ఆ తర్వాత వ్యాధినిరోధక కణాల ఉత్పత్తిలో అలసత్వం ప్రదర్శిస్తాయి. ఈ కారణంగానే వృద్ధాప్యంలో మనకు వ్యాధులొస్తాయి. తాజాగా- మూలకణాల్లో ఈ అలసత్వానికి కారణమైన ప్రత్యేక కణాలని గుర్తించారు అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఆ కణాలని సరిదిద్దే ప్రొటీన్‌లని(యాంటీ బాడీలు) ఆవిష్కరించారు. వాటితో ఓ ఔషధాన్ని తయారుచేసి రెండేళ్ళ వయసున్న ఎలుకలపైన ప్రయోగించారు. ఎలుకల్లో రెండేళ్ళంటే- మనుషుల్లో 70 ఏళ్ళకి సమానమట. ఈ ఔషధాన్ని ప్రయోగించిన ఎలుకల్లో- వాటి వ్యాధినిరోధకశక్తి పుంజుకుందట. తక్కువ వయసున్న మూషికాలకి సమానంగా రోగనిరోధకతని చూపాయట! ఈ ఫలితాలిచ్చిన ఉత్సాహంతో ఈ యాంటీబాడీలని జంతువులపైన ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..