ఆ గుడ్డు తినొచ్చు!

శాకాహారులైనా మాంసాహారులైనా సరే- గుడ్లు తినడంపైనా ఎన్నో భయాలు అలముకుంటున్నాయిప్పుడు. ముఖ్యంగా- గుడ్డులో కొవ్వుశాతం ఎక్కువగా ఉంటుందనీ, అది హృద్రోగాలకి దారితీస్తుందనీ చాలామంది నమ్ముతారు.

Published : 14 Apr 2024 00:20 IST

శాకాహారులైనా మాంసాహారులైనా సరే- గుడ్లు తినడంపైనా ఎన్నో భయాలు అలముకుంటున్నాయిప్పుడు. ముఖ్యంగా- గుడ్డులో కొవ్వుశాతం ఎక్కువగా ఉంటుందనీ, అది హృద్రోగాలకి దారితీస్తుందనీ చాలామంది నమ్ముతారు. ఇందులోని నిజాలేమిటో తేల్చుకోవాలని తాజాగా ఓ చిన్నపాటి పరిశోధన నిర్వహించారు అమెరికాలో. అక్కడి డ్యూక్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఇందుకోసం అరవైయేళ్ళు దాటిన 140 మందిని ఎంచుకున్నారు. వీళ్ళలో సగంమందిని విటమిన్లు ఎక్కువగా ఉన్న ‘ఫార్టిఫైడ్‌’ గుడ్లని తినమన్నారు. వారానికి 12 గుడ్లు- ఏరూపంలోనైనా తీసుకోవచ్చని చెప్పారు. మిగతావాళ్ళని ఐదుకన్నా తక్కువ గుడ్లు తినమన్నారు. నాలుగు నెలల తర్వాత వాళ్ళని పరీక్షిస్తే- గుడ్లు  ఎక్కువగా తిన్నవాళ్ళలో కొలెస్ట్రాల్‌ పెరగకపోగా -0.64 నుంచి -3.14 వరకూ తగ్గిందట. పైగా, గుడ్డులోని విటమిన్లు అందడం వల్ల మధుమేహానికి కారణమైన ‘ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌’ కూడా స్వల్పంగా తగ్గిపోయిందని చెబుతున్నారు! కాబట్టి, రోజుకో గుడ్డు తినడం మేలేనంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..