నిద్రతగ్గితే... బీపీ పెరిగినట్టే!

‘ఆ... నిద్రతగ్గితే ఏముంది? ఓ పూట చికాగ్గా ఉంటుంది అంతేగా!’ అంటుంటారు చాలామంది. అనడమే కాదు- పార్టీలంటూ బాతాఖానీలంటూ అపరాత్రివేళ ఎప్పుడో పడుకుని తొందరగా నిద్రలేచి రోజువారి పనుల్లో పడిపోతుంటారు.

Published : 14 Apr 2024 00:22 IST

‘ఆ... నిద్రతగ్గితే ఏముంది? ఓ పూట చికాగ్గా ఉంటుంది అంతేగా!’ అంటుంటారు చాలామంది. అనడమే కాదు- పార్టీలంటూ బాతాఖానీలంటూ అపరాత్రివేళ ఎప్పుడో పడుకుని తొందరగా నిద్రలేచి రోజువారి పనుల్లో పడిపోతుంటారు. అలాంటివాళ్ళు తరచూ రక్తపోటుని పరీక్షించుకోవడం మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. ఏడుగంటలకన్నా తక్కువసేపు నిద్రపోయేవారిలో రక్తపోటు సమస్య పెరుగుతోందని చెబుతున్నారు. ఇరాన్‌కి చెందిన ‘తెహ్రాన్‌ హార్ట్‌ సెంటర్‌’ పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలమంది రక్తపోటు బాధితుల డేటాని విశ్లేషించి ఈ విషయాన్ని నిర్ధారించారు. నిద్రవేళలు- ఏడుగంటలకన్నా తక్కువయ్యేకొద్దీ రక్తపోటు ప్రమాదమూ పెరుగుతోందట. నిద్ర తగ్గడం వల్ల అడ్రినలైన్‌, కార్టిసాల్‌ వంటి ఒత్తిడి హార్మోన్‌ల జోరు పెరగడం- దానివల్ల రక్తనాళాలు కుంచించుకుపోవడం ఇందుకో కారణం కావొచ్చంటున్నారు. కాబట్టి- నిద్రలేవడానికే కాదు సరైన సమయంలో నిద్రపోవడానికీ అలారం పెట్టుకోమంటున్నారీ శాస్త్రవేత్తలు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..