ఏఐ... పెర్ఫ్యూమ్‌లనీ తయారుచేసేస్తోంది!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)కి వందబొమ్మల్ని ఇచ్చి- వాటి ఆధారంగా ఓ కొత్త బొమ్మని తయారుచేయమంటే చేస్తుంది. వంద పాటల్ని అందించి అలాంటి ఓ కొత్త పాటని రాయమంటే రాస్తుంది.

Published : 20 Apr 2024 23:46 IST

ర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)కి వందబొమ్మల్ని ఇచ్చి- వాటి ఆధారంగా ఓ కొత్త బొమ్మని తయారుచేయమంటే చేస్తుంది. వంద పాటల్ని అందించి అలాంటి ఓ కొత్త పాటని రాయమంటే రాస్తుంది. మరి ఈ తరహాలో- ఓ కొత్త పెర్ఫ్యూమ్‌నీ సృష్టిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది నార్వేకి చెందిన పరిశోధకులకి. ఇదేదో కేవలం ప్రయోగాల కోసం చేసింది కాదు. నిజంగానే- సెంటు తయారీ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త సువాసనల్ని తయారుచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ, ప్రస్తుతమున్న సంప్రదాయ విధానంలో- ఓ కొత్త సువాసనని కనిపెట్టాలంటే కనీసం మూడేళ్ళుపడుతోంది. ఒక కిలో సువాసనా ద్రవ్యాన్ని రూపొందించడానికి కనీసం రూ.50లక్షల రూపాయలవుతోంది! అందుకే, ఏఐ సాయంతో కొత్త ద్రవ్యాలని తయారుచేసేందుకు నడుంబిగించారు నార్వీజియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలోని శాస్త్రవేత్తలు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏఐ ‘న్యూరల్‌ నెట్‌వర్క్‌’ని సృష్టించి దానికి శిక్షణ ఇచ్చారు. వివిధ రకాల సువాసనల్ని- వాటికి సంబంధించిన రసాయన అణువుల సమాచారాన్నీ అందించారు. వాటితో ఓ కొత్త సుగంధద్రవ్యాన్ని ఎలా రూపొందించాలో కూడా చెప్పారు. ఇప్పటికే ఏఐ కొత్తకొత్త అత్తర్లను తయారుచేయడం కూడా మొదలుపెట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు