‘లయ’ని మాత్రమే గుర్తుపడతారట!

గర్భంలో ఉన్నప్పుడే శిశువులు తల్లి గొంతుకీ, మిగతావాళ్ళ కంఠానికీ మధ్య తేడాని గుర్తుపట్టేస్తారని మనకు తెలిసిందే! ‘మరి వాళ్ళు దేన్ని గుర్తుపడతారు? ఒట్టి కంఠాన్నేనా? లేదా మాటల్లోని లయనా?’ అన్న సందేహం వచ్చింది శాస్త్రవేత్తలకి.

Published : 20 Apr 2024 23:49 IST

ర్భంలో ఉన్నప్పుడే శిశువులు తల్లి గొంతుకీ, మిగతావాళ్ళ కంఠానికీ మధ్య తేడాని గుర్తుపట్టేస్తారని మనకు తెలిసిందే! ‘మరి వాళ్ళు దేన్ని గుర్తుపడతారు? ఒట్టి కంఠాన్నేనా? లేదా మాటల్లోని లయనా?’ అన్న సందేహం వచ్చింది శాస్త్రవేత్తలకి. ఇందుకోసం అరవైమంది గర్భిణుల్ని రెండు బృందాలుగా విభజించారు. రెండు గ్రూపులకీ ముందుగా రికార్డు చేసిన వేర్వేరు పాటల్ని ఇచ్చి- ఏడో నెల చివరి రోజుల నుంచి పొట్టకి కాస్త దగ్గరగా పెట్టుకుని వినమన్నారు. శిశువులు పుట్టిన నాలుగునెలల వాళ్ళని పరీక్షించారు. ఇందుకోసం వాళ్ళ తలకి ఈఈజీ యంత్రాల్ని పెట్టి మెదడు స్పందనల్ని పరిశీలించారు. శిశువులు గర్భంలో ఉన్నప్పుడు విన్న పాత పాటని యథాతథంగా వినిపిస్తే- వాళ్ళు దాన్ని గుర్తుపట్టారట. అదే పాటని కాస్త లయ మార్చి వినిపిస్తే గుర్తుపట్టలేకపోయారట. అంతేకాదు, ఓ గ్రూపు గర్భిణులు విన్న రైమ్‌ని మరో గ్రూపుకి చెందిన గర్భిణుల పిల్లలు పట్టించుకోలేదట. దాన్నిబట్టి- శిశువులు గుర్తుపట్టేది ఒట్టి కంఠాన్నో మాటల్నో కాదు, మాట్లాడేటప్పుడు మనం ఉపయోగించే గొంతు హెచ్చుతగ్గుల్నీ, లయనీ అని నిర్ధారించారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగంతో కొందరు పిల్లలు భాష నేర్చుకోవడంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని అంచనా వేయొచ్చంటున్నారు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..