ఆ బ్యాక్టీరియానే క్యాన్సర్‌కి కారణమా?

పెద్దపేగు క్యాన్సర్‌... ఒకప్పుడు 50లు దాటినవాళ్ళలోనే ఎక్కువగా కనిపించేది. పాశ్చాత్యదేశాల్లో ఇప్పుడది యువతనీ కబళిస్తోంది. దానికి కారణాలూ, నివారణలూ వెతికే క్రమంలో తాజాగా ఓ కొత్త లంకెని పట్టుకున్నారు చైనా శాస్త్రవేత్తలు.

Published : 20 Apr 2024 23:51 IST

పెద్దపేగు క్యాన్సర్‌... ఒకప్పుడు 50లు దాటినవాళ్ళలోనే ఎక్కువగా కనిపించేది. పాశ్చాత్యదేశాల్లో ఇప్పుడది యువతనీ కబళిస్తోంది. దానికి కారణాలూ, నివారణలూ వెతికే క్రమంలో తాజాగా ఓ కొత్త లంకెని పట్టుకున్నారు చైనా శాస్త్రవేత్తలు. ఈ క్యాన్సర్‌కి గురైన యువత జీర్ణాశయంలో కామన్‌గా కొన్ని బ్యాక్టీరియా కనిపిస్తున్నాయని పసిగట్టారు. సాధారణంగా- జీర్ణాశయంలోని సూక్ష్మజీవుల్లో (గట్‌ మైక్రోబియం) అన్నీ మంచి చేసేవే ఉంటాయన్న అపోహ ప్రజల్లో ఉంది. కానీ- అవన్నీ మనకు మంచే చేయవని చెబుతున్నారు ఈ పరిశోధకులు. ముఖ్యంగా- ఫ్యుసో బ్యాక్టీరియం, క్లాస్ట్రిడియం, షెవానిల్లా రకం సూక్ష్మజీవులు పెద్దపేగు క్యాన్సర్‌ ఉన్న యువతలో ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. ఈ బ్యాక్టీరియాకీ- యువత తీసుకునే ఆహారానికీ సంబంధం ఉందనీ ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాలిష్‌ చేసిన ధాన్యాలూ, ప్రాసెస్‌ చేసిన మాంసపదార్థాలూ, చక్కెరతో కూడిన చిరుతిళ్ళూ ఎక్కువగా తినేవాళ్ళలో ఈ బ్యాక్టీరియా అధికంగా ఉన్నాయట. కాబట్టి- ఇప్పటికే పెద్దపేగు క్యాన్సర్‌కి గురైనవాళ్ళు పీచు ఎక్కువగా ఉన్న ధాన్యాలూ, పండ్లూ తీసుకుంటే చెడుచేసే బ్యాక్టీరియా తగ్గొచ్చని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు