ఆందోళన... వాళ్ళలోనూ!

దశాబ్దం కిందటి దాకా పన్నెండేళ్ళలోపు పిల్లల్లో మానసిక కుంగుబాటూ, ఆందోళనల్లాంటివి ఉంటాయంటే- వైద్యులు కూడా కొట్టిపారేసేవారు! ఇప్పుడు పరిస్థితి మారింది. తాజాగా కెనడాకి చెందిన క్యాల్‌గరీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు...

Published : 28 Apr 2024 00:15 IST

 

శాబ్దం కిందటి దాకా పన్నెండేళ్ళలోపు పిల్లల్లో మానసిక కుంగుబాటూ, ఆందోళనల్లాంటివి ఉంటాయంటే- వైద్యులు కూడా కొట్టిపారేసేవారు! ఇప్పుడు పరిస్థితి మారింది. తాజాగా కెనడాకి చెందిన క్యాల్‌గరీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు... దీనిపైన ఓ పరిశోధన నిర్వహించారు. 2020-21 మధ్య వివిధ పరిశోధనా సంస్థలు 80 వేల మంది పిల్లలపైన నిర్వహించిన 29 అధ్యయనాలని విశ్లేషణకు తీసుకున్నారు. ఈ తాజా విశ్లేషణ ద్వారా పిల్లల్లో మానసిక కుంగుబాటు(డిప్రెషన్‌) 25 శాతం, ఆందోళన(యాంగ్జైటీ) 20 శాతం వరకూ పెరిగాయని తేల్చారు. చీటికీమాటికీ కోపం తెచ్చుకోవడం, చిన్న సమస్యలకే ఏడ్చేయడం, ఏకాగ్రతాలోపం, నిద్రలేమి... ఇవన్నీ ఈ సమస్య లక్షణాలు. కుటుంబంలో ఆర్థికంగానూ, అనుబంధాల పరంగానూ ఏర్పడుతున్న సమస్యలు ఆందోళన పెరుగుదలకి కారణం కావొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. సామాజిక మాధ్యమాలు కూడా దీనికి కారణమై ఉండొచ్చనీ చెబుతున్నారు. ఈ రెండింటితోపాటూ బడిలో చదువుపరంగా పెరుగుతున్న ఒత్తిడీ ఈ సమస్యకి దారితీయొచ్చని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..