ఆ హార్మోన్‌ తగ్గితే... ఆయుష్షు పెరగొచ్చు!

ఇదో హార్మోన్‌ కథ. ఇన్సులిన్‌ లైక్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌-1(ఐజీఎఫ్‌1) అన్నది దాని పేరు. బాల్యంలో మన శరీరం ఎదగడానికి దోహదపడే కీలక హార్మోన్‌లలో ఇదీ ఒకటి.

Published : 05 May 2024 00:25 IST

ఇదో హార్మోన్‌ కథ. ఇన్సులిన్‌ లైక్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌-1(ఐజీఎఫ్‌1) అన్నది దాని పేరు. బాల్యంలో మన శరీరం ఎదగడానికి దోహదపడే కీలక హార్మోన్‌లలో ఇదీ ఒకటి. కానీ ఇదే హార్మోను మనం పెద్దయ్యాక సమస్య సృష్టిస్తోందని గుర్తించారు శాస్త్రవేత్తలు. రక్తపోటు, హృద్రోగం, క్యాన్సర్‌లకీ కారణమవుతోందని చెబుతున్నారు. ఉదాహరణకి- మామిడి ఉందనుకుందాం. పిందెగా ఉన్నప్పుడు అది ఎదగడానికీ పండటానికీ¨ ఓ సహజ రసాయనం కావాల్సి ఉంటుంది. మరి అది బాగా పండాక కూడా- ఆ రసాయనం చురుగ్గా పనిచేస్తూ ఉంటే పండు మిగలమగ్గి కుళ్ళుతుంది కదా! మనుషుల్లోనూ ఇదే జరుగుతోందంటున్నారు న్యూయార్క్‌లోని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌కి చెందిన శాస్త్రవేత్తలు. వృద్ధుల్లో ఈ హార్మోన్‌ స్థాయుల్ని తగ్గించి అనారోగ్యాల్లేని ఆయుష్షు సొంతం చేసే దిశగా పలు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని తాజాగా ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..