అన్ని ‘ఒమేగా’లూ మంచివేనా?

ఈ మధ్య విడుదలైన ఓ పుస్తకం ప్రపంచ పోషకాహార నిపుణుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ‘ఒమేగా బ్యాలన్స్‌’ పేరుతో ఆంథోని హల్బర్ట్‌ అనే శాస్త్రవేత్త రాసిన పుస్తకం ఇది.

Published : 05 May 2024 00:27 IST

ఈ మధ్య విడుదలైన ఓ పుస్తకం ప్రపంచ పోషకాహార నిపుణుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ‘ఒమేగా బ్యాలన్స్‌’ పేరుతో ఆంథోని హల్బర్ట్‌ అనే శాస్త్రవేత్త రాసిన పుస్తకం ఇది. ఆహారానికి సంబంధించి ఎవరి నోట విన్నా ఇప్పుడు ‘ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్‌’ మాటే వినిపిస్తోంది కదా! శరీరానికి మంచి చేసే ‘అసంతృప్త’(అన్‌శాచ్యురేటెడ్‌) కొవ్వులివి. ఆకుకూరలు, చేపలు, గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలతో చేసిన నూనెలు ఈ కోవలోకి వస్తాయి. జంతువుల మాంసం, వెన్న వంటివాటితో వచ్చే సంతృప్త(శాచ్యురేటెడ్‌) కొవ్వులు మరో రకం. అవి మనకి చెడుచేస్తాయంటారు. అందుకే- ‘గత యాభై యేళ్ళుగా అమెరికన్‌లు అనారోగ్యంపైన భయంతో సంతృప్త కొవ్వులకి దూరమవుతూనే ఉన్నారు.

ఒమేగా’ కొవ్వుల్నే తింటున్నారు. అయినా సరే- హృద్రోగాలూ, మధుమేహాలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఉందంటున్నాడు ఒమేగా బ్యాలన్స్‌ రచయిత హల్బర్ట్‌. అదేంటంటే- అమెరికన్‌లైనా, వాళ్ళని అనుసరించే ఇతర దేశాలవాళ్ళయినా ‘ఒమేగా-6’ కొవ్వులు ఎక్కువగా ఉన్నవాటిని తింటున్నారూ, అసలైన మంచిచేసే ‘ఒమేగా-3’కి దూరమవుతున్నారూ అని. ఈ రెండింటికీ ఏమిటి తేడా అంటారా- ‘ఒమేగా-6’ కొవ్వులు ప్రధానంగా గింజలూ, విత్తనాలూ, పొద్దుతిరుగుడు పువ్వుల నూనెలూ, వాటితో చేసిన తినుబండారాల్లో ఉంటాయి. ‘ఒమేగా-3’ కొవ్వులేమో ఆకుకూరలూ, చేపల్లో కనిపిస్తాయి. అమెరికన్‌లు ఒమేగా-6 ఉన్నవాటిని అవసరానికన్నా ఎక్కువగా తీసుకోవడం వల్లే అనారోగ్యాల పాలవుతున్నారని సోదాహరణంగా చెబుతున్నాడు హల్బర్ట్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..