బరువు తగ్గడం అందుకే అంత కష్టం!

‘బరువు తగ్గడం అంత సులభమేమీ కాదు... బాబూ!’ అంటుంటారు స్థూలకాయులు. అది విన్నవాళ్ళు ‘వీళ్ళకు పట్టుదల లేదంతే!’ అని కొట్టిపారేస్తారు కానీ... నిజంగానే అది చాలా కష్టమని చెబుతున్నారు కెనడా పరిశోధకులు.

Published : 05 May 2024 00:29 IST

‘బరువు తగ్గడం అంత సులభమేమీ కాదు... బాబూ!’ అంటుంటారు స్థూలకాయులు. అది విన్నవాళ్ళు ‘వీళ్ళకు పట్టుదల లేదంతే!’ అని కొట్టిపారేస్తారు కానీ... నిజంగానే అది చాలా కష్టమని చెబుతున్నారు కెనడా పరిశోధకులు. క్వీన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇందుకోసం ఓ చిత్రమైన అధ్యయనం చేశారు. ఊబకాయులూ మామూలు బరువు ఉన్నవాళ్ళ ముందు పిజ్జా, బర్గర్‌లతోపాటూ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారపదార్థాలని ఉంచారు. ఏది కావాలో ఎంచుకోమని చెప్పి- వాళ్ళ మెదడుని ఎమ్మారై స్కాన్‌ తీశారు. ‘ఆహారాన్ని ఎంపికచేసుకునే విషయంలో వాళ్ళ మెదడు డోలాయమాన స్థితికి గురవుతోందా?’ అని చూశారు. బరువు తక్కువగా ఉన్నవాళ్ళు పెద్దగా ఇబ్బందేమీ లేకుండా పిజ్జా, బర్గర్‌లని అతి సులువుగా వద్దనుకుని మంచి ఆహారాన్ని ఎంచుకున్నారట. అదే ఊబకాయుల్లోనైతే మెదడు తొందరగా ఓ నిర్ణయానికి రాలేక ఎంతో ఒత్తిడికి లోనైందట. అదే వాళ్ళని- స్థూలకాయులుగా మారుస్తోందని చెబుతున్నారు ఈ శాస్త్రవేత్తలు. మానసిక శక్తి(విల్‌పవర్‌)కీ దీనికీ సంబంధంలేదనీ... వాళ్ళ మెదడు నిర్మాణమే ఇందుకు కారణం అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు