ఆ ఇన్ఫెక్షన్‌కో విరుగుడు!

మూత్రనాళం ఇన్ఫెక్షన్‌(యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌- యూటీఐ)... స్త్రీలని వేధించే సమస్యల్లో ఒకటి. మగవాళ్ళతో పోలిస్తే మహిళలు 30 రెట్లు ఎక్కువగా ఈ సమస్య బారినపడతారట.

Published : 12 May 2024 00:01 IST

మూత్రనాళం ఇన్ఫెక్షన్‌(యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌- యూటీఐ)... స్త్రీలని వేధించే సమస్యల్లో ఒకటి. మగవాళ్ళతో పోలిస్తే మహిళలు 30 రెట్లు ఎక్కువగా ఈ సమస్య బారినపడతారట. వారిలో 20 శాతం మంది మళ్ళీ మళ్ళీ ఈ సమస్యకి లోనవుతున్నారట. ఈ మొండి సమస్యకే ఓ సులువైన వ్యాక్సిన్‌ని తీసుకొచ్చారు ఇంగ్లండులోని రాయల్‌ బర్క్‌షైర్‌ ఆసుపత్రి పరిశోధకులు. ‘యూరోమ్యూన్‌’ అనే ఈ టీకా మందుని నాలుక కింద భాగంలో స్ప్రే చేసుకోవాలి. అక్కడి నుంచి మన శరీరంలోని ఇతర ‘మ్యూకోజా’ భాగాల్లోకి ప్రవేశించే ఈ ఔషధం యూటీఐకి కారణమయ్యే 88 బ్యాక్టీరియాలపైన పోరాడుతుందట. టీకాలని సాధారణంగా నిర్వీర్యమైన బ్యాక్టీరియాతో చేస్తుంటారు. కానీ ఇది అలాకాదు. ఇందులోని ఔషధం శరీరంలోని బ్యాక్టీరియాని చంపదు... వాటిని స్థాణువుల్లా ఎటూ కదలకుండా చేస్తుంది. వాటి ప్రొటీన్‌ను అలాగే ఉంచుతుంది. శరీరంలోని రోగనిరోధకశక్తి ఆ ప్రొటీన్‌ని గుర్తించి - ఎటూ కదల్లేని బ్యాక్టీరియా అంతుచూస్తుంది. దీన్ని ప్రయోగాత్మకంగా వాడిన మగువల్లో తొమ్మిదేళ్ళపాటు సమస్య రాకుండా కాచుకుందట ఈ టీకా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..