జన్యు సమస్యలున్నా ఆయుష్షు పెంచుకోవచ్చు!

వృద్ధాప్యంలోనో అంతకు కాస్త ముందో వచ్చే పలు ఆరోగ్య సమస్యలకి జన్యులోపాలు కారణమై ఉండొచ్చని నేటి సైన్స్‌ చెబుతోంది. మరి అలాంటి లోపాల్ని ఆరోగ్యకరమైన అలవాట్లతో అధిగమించి ఆయుష్షు పెంచుకోవచ్చా అంటే సాధ్యమేనంటోంది ఈ పరిశోధన.

Published : 12 May 2024 00:03 IST

వృద్ధాప్యంలోనో అంతకు కాస్త ముందో వచ్చే పలు ఆరోగ్య సమస్యలకి జన్యులోపాలు కారణమై ఉండొచ్చని నేటి సైన్స్‌ చెబుతోంది. మరి అలాంటి లోపాల్ని ఆరోగ్యకరమైన అలవాట్లతో అధిగమించి ఆయుష్షు పెంచుకోవచ్చా అంటే సాధ్యమేనంటోంది ఈ పరిశోధన. చైనాలోని జేజాంగ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య వివరాలతో చేసిన అధ్యయనం ఇది. ఇందుకోసం ఇంగ్లండులోని ‘యూకే బయోబ్యాంక్‌’లో తమ ఆరోగ్య సమాచారాన్ని నమోదుచేసిన సుమారు మూడున్నర లక్షలమంది వివరాలని సేకరించారు. ఇలాగే వాళ్ళలోని దురలవాట్లూ, వ్యాయామం తదితరాలతో కూడిన జీవనశైలికీ మార్కులు వేశారు. 13 ఏళ్ళ తర్వాత... వాళ్ళలో సుమారు పాతికవేలమంది చనిపోయారట. అలా చనిపోయినవారిలో జీవనశైలితో సంబంధంలేకుండా కేవలం జన్యులోపాల కారణంగా మరణించినవారు 21 శాతమే ఉన్నారట. అదే- ప్రమాదకర జీవనశైలి ఉన్నవారిలో 78 శాతం మంది జన్యులోపాలు లేకున్నా అల్పాయుష్షుతో చనిపోయారట.జన్యు లోపాలున్నాసరే జీవనశైలి బాగున్న 62 శాతంమంది ఎక్కువ కాలం బతికారట. దీన్నిబట్టి జన్యువులకన్నా జీవనశైలే దీర్ఘాయుష్షుకి ప్రధానమని చెబుతున్నారు పరిశోధకులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..