ఏ గ్రూపు రక్తమైనా... ఫర్వాలేదు!

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ‘ఒ-నెగటివ్‌’ గ్రూపు రక్తాన్ని ఎవరికైనా ఇవ్వొచ్చని చెబుతారు. అందుకే, దాన్ని ‘యూనివర్సల్‌ డోనర్‌’ అనీ అంటారు. కాకపోతే, ఇది చాలా అరుదైన గ్రూపు.

Published : 12 May 2024 00:05 IST

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ‘ఒ-నెగటివ్‌’ గ్రూపు రక్తాన్ని ఎవరికైనా ఇవ్వొచ్చని చెబుతారు. అందుకే, దాన్ని ‘యూనివర్సల్‌ డోనర్‌’ అనీ అంటారు. కాకపోతే, ఇది చాలా అరుదైన గ్రూపు. ప్రపంచంలో కేవలం ఏడుశాతం మందిలోనే ఈ తరహా రక్తం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే, మామూలు ఎ, బి గ్రూపుల్ని కూడా ‘యూనివర్సల్‌ డోనర్‌’గా మారిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది శాస్త్రవేత్తలకి. బ్లడ్‌ గ్రూపులకి కొన్ని అదనపు ఎంజైమ్‌లని చేర్చడం ద్వారా ఇది సాధ్యం కావొచ్చని- ఇప్పుడు కాదు- 40 ఏళ్ళకిందటే ఊహించారు. అప్పట్నుంచీ దానిపైన జరుగుతూ వచ్చిన పరిశోధనలు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయి. ‘బి’ గ్రూపుని ఇంచుమించు అలా ‘యూనివర్సల్‌ డోనర్‌’ రక్తంగా మార్చేశామని తాజాగా ప్రకటించారు డెన్మార్క్‌ టెక్నికల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. మన కడుపులో ఉండే ‘అకర్‌మాన్సియా ముసినిఫిలా’ అనే బ్యాక్టీరియా విడుదల చేసే ఎంజైమ్‌లని ఇంద]ుకోసం వాడుకున్నారట. ఈ ఎంజైమ్‌ బి గ్రూపులోని యాంటిజెన్‌ని ధ్వంసం చేస్తుందనీ, అలా ధ్వంసం చేయడం ద్వారా అది ఇతర ఏ గ్రూపు రక్తంతోనైనా కలిసిపోతుందనీ చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఆ రకంగా, బి గ్రూపు రక్తాన్ని ఇకపైన ఎవరికైనా ఇచ్చేలా దాదాపు మార్చామంటూ త్వరలో, ‘ఎ’ గ్రూపు రక్తాన్నీ ఇలా మార్చే పరిశోధన మొదలుపెడతామని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..