పిల్లల్లో నిద్రతగ్గితే...

చదువుల భారమో, ఇంకేమైనా భయాలో... కారణం ఏదైనా సరే ప్రపంచవ్యాప్తంగా కొందరు చిన్నారుల్లో నిద్ర తగ్గుతోంది. ఈ కారణంగా వాళ్ళలో పెద్దయ్యాక ‘సైకోసిస్‌’ సమస్యలు పెరుగుతున్నాయట.

Published : 18 May 2024 23:52 IST

దువుల భారమో, ఇంకేమైనా భయాలో... కారణం ఏదైనా సరే ప్రపంచవ్యాప్తంగా కొందరు చిన్నారుల్లో నిద్ర తగ్గుతోంది. ఈ కారణంగా వాళ్ళలో పెద్దయ్యాక ‘సైకోసిస్‌’ సమస్యలు పెరుగుతున్నాయట. దృశ్యాలో, శబ్దాలో, వాసనలో... ఏవైనా సరే చుట్టూలేనివాటిని ఉన్నట్టు భ్రమించడాన్ని సైకోసిస్‌ లక్షణంగా చెబుతారు. దీనికీ- చిన్నప్పుడు నిద్రవేళలు తగ్గడానికీ కారణముండొచ్చన్న సందేహంతో ఇటీవల ఓ పరిశోధనని చేపట్టారు ఇంగ్లండులోని బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఇంగ్లండులో ఇదివరకు జరిగిన ‘అవాన్‌ లాంగిట్యూడినల్‌ స్టడీ ఆఫ్‌ పేరెంట్స్‌ అండ్‌ చిల్డ్రన్‌(ఆల్స్‌పాక్‌) అన్న సమగ్ర సర్వే నుంచి సుమారు 12 వేల మంది వివరాలని ఇందుకోసం సేకరించారు. పుట్టుక నుంచీ 24 ఏళ్ళవరకూ వాళ్ళ తీరుతెన్నుల్ని గమనించారు. చక్కగా నిద్రపోయేవాళ్ళకన్నా నిద్రతగ్గిన చిన్నారులు పెద్దయ్యాక రెండింతలు ఎక్కువగా సైకోసిస్‌ సమస్యలకి లోనైనట్లు గుర్తించారు. టీనేజీకి వచ్చేలోపే వీరిలో సైకోసిస్‌ లక్షణాలు స్పష్టంగా కనిపించే అవకాశం నాలుగురెట్లు ఉందనీ తేల్చింది. ప్రతి నిద్రలేమీ- సైకోసిస్‌కి కారణమవుతుందని చెప్పకపోయినా ఆ రెండింటికీ మధ్య సంబంధం కొట్టిపారేయలేనిదని ఈ పరిశోధన చెబుతోంది. కాబట్టి- తల్లిదండ్రులు చిన్నారుల్లో ఏమాత్రం నిద్రలేమి సమస్య కనిపించినా అన్నిరకాలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..