‘ఇమ్యూన్‌’ దాడికి అదే కారణం!

లూపస్‌... మనకి మంచి చేయాల్సిన రోగనిరోధక వ్యవస్థ మనపైనే దాడిచేసే ‘ఆటో ఇమ్యూన్‌’ వ్యాధి. శరీరంపైన దద్దుర్లు రావడం నుంచి రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ దాకా చాలా సమస్యలు వస్తాయి దీనివల్ల.

Published : 19 May 2024 00:10 IST

లూపస్‌... మనకి మంచి చేయాల్సిన రోగనిరోధక వ్యవస్థ మనపైనే దాడిచేసే ‘ఆటో ఇమ్యూన్‌’ వ్యాధి. శరీరంపైన దద్దుర్లు రావడం నుంచి రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ దాకా చాలా సమస్యలు వస్తాయి దీనివల్ల. ఈ సమస్య బాధితుల్లో 90 శాతం మహిళలే ఉంటారు. అదీ భారతీయుల్లో దీని ప్రభావం మరీ ఎక్కువ. తాజాగా దీనికి మూలకారణమేంటో పసిగట్టారు ఫ్రాన్స్‌లోని పారిస్‌ సిటీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. మామూలుగా మగవారిలో ఎక్స్‌-వై క్రోమోజోములూ, మహిళల్లో ఎక్స్‌-ఎక్స్‌ క్రోమోజోములూ ఉంటాయని తెలుసు మనకు. కానీ- ఆడపిల్లలు రజస్వల కాగానే రెండు ‘ఎక్స్‌’ క్రోమోజోముల్లో ఒకటి బలహీనపడుతుంది. ఇలా బలహీనపడ్డ క్రోమోజోము కొందరు మహిళల్లో నడివయసు తర్వాత మళ్ళీ క్రియాశీలం అవుతోందట. అది అలా చురుకుదనాన్ని అందుకోవడం వల్ల- ‘టీఎల్‌ఆర్‌7’ అనే జన్యువు ప్రేరణకి గురై రోగనిరోధక వ్యవస్థని అవసరానికన్నా ఎక్కువగా స్పందించేలా చేస్తోందట. మహిళల్లో లూపస్‌ సమస్యకి ఇదే మూలమని ఈ పరిశోధన తేల్చింది. ఈ స్పష్టతతో రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ వంటి సమస్యలకి మేలైన చికిత్స సాధ్యం కావొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు