విషప్రయోగం చేస్తే... తప్పించుకోలేరు!

ఓ హంతకుడు విష ప్రయోగంతో హత్య చేశాడనుకుందాం. లేదా హత్య చేసేటప్పుడు మద్యం మత్తులో ఉన్నాడను కుందాం.

Published : 26 May 2024 00:24 IST

హంతకుడు విష ప్రయోగంతో హత్య చేశాడనుకుందాం. లేదా హత్య చేసేటప్పుడు మద్యం మత్తులో ఉన్నాడను కుందాం. ఈ విషయాలని కేవలం వాళ్ళ వేలిముద్రల్ని బట్టి తెలుసుకునే అవకాశం ఇప్పటిదాకా లేదు. అదే సాధ్యమైతే పోలీసులకి ఎంతో సమయం ఆదా అవుతుంది.  కానీ- ప్రస్తుతమున్న వేలిముద్రల విశ్లేషణలో అవి బయటపడే అవకాశం లేదు. ప్రస్తుతం ఆ ముద్రలు తీయడానికి ప్రపంచవ్యాప్తంగా ‘జిలెటిన్‌’ రసాయనంతో చేసిన ‘లేయర్స్‌’ని వాడుతున్నారు. ఈ జిలెటిన్‌- ఇతర రసాయనాల అవశేషాల్ని కప్పేస్తుంది కాబట్టి దోషులు విషమో మద్యమో వాడిన సంగతి బయటపడదు. అందుకు ఓ సరికొత్త పద్ధతిని ఆవిష్కరించారు యూకేలోని లఫ్‌బరో విశ్వ విద్యాలయం పరిశోధకులు. పోలీసులు తీస్తున్న వేలిముద్రల్లో- నిందితులు అదివరకు వాడిన రసాయనాల అవశేషాల్ని పసిగట్టే ‘మాస్‌ స్పెక్ట్రోమెట్రీ’ అన్న పద్ధతిని ఆవిష్కరించారు.  పోలీసుల దర్యాప్తుకి ఇది ఎంతో ఉపయోగ పడుతుందనీ, వేలిముద్రల ప్రాధాన్యాన్ని మరింత పెంచుతుందనీ వారు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..