అలా కూర్చోనివ్వకండి!

పిల్లలకు సమ్మర్‌ క్లాసులు మొదటి వారం తర్వాత పెద్దగా ఉత్సాహాన్నివ్వవు. వాటినీ, నిద్రవేళల్నీ పక్కనపెడితే ఇంట్లో ఉన్న సమయాన్ని ఫోను- టీవీలతో గడిపేస్తుంటారు.

Published : 26 May 2024 00:25 IST

పిల్లలకు సమ్మర్‌ క్లాసులు మొదటి వారం తర్వాత పెద్దగా ఉత్సాహాన్నివ్వవు. వాటినీ, నిద్రవేళల్నీ పక్కనపెడితే ఇంట్లో ఉన్న సమయాన్ని ఫోను- టీవీలతో గడిపేస్తుంటారు. ఒక్కోసారి అవీ బోర్‌కొట్టి ఏ సోఫా మీదో జారగిల పడతారు. శారీరకంగానూ మానసికంగానూ ఏ మాత్రం శ్రమలేని ఇలాంటి జీవనశైలి  భవిష్యత్తులో తీవ్ర విపరిణామాలకి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. దీనిపైన బ్రిస్టల్‌ యూనివర్సిటీ, ఫిన్‌లాండ్‌ వర్సిటీల శాస్త్రవేత్తలు ఓ సమగ్ర సర్వే నిర్వహించారు. ఈ శ్రమరాహిత్యం పెద్దయ్యాక హృద్రోగ సమస్యలకి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం పరిశోధకులు 11 నుంచి 24 ఏళ్ళ మధ్య వయసున్న 1682 మంది జీవనశైలినీ ఆరోగ్య వివరాలనీ ఏడేళ్లపాటు పరిశీలించారు. చిన్నపిల్లల్లో ఆరుగంటలుగా ఉండే ఈ ‘ఖాళీ సమయం’... పెద్దయ్యేకొద్దీ తొమ్మిదిగంటలదాకా ఉంటోందని వాళ్ళు చెబుతున్నారు. దీనివల్ల ఊబకాయం వచ్చి గుండె 40 శాతం పెరిగి ‘లెఫ్ట్‌ వెంట్రికల్‌ హైపర్‌ట్రోఫీ’ వంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు. తల్లిదండ్రులకి వంటల్లో సాయపడటం, వాళ్ళకోసం దుకాణాలకి వెళ్ళిరావడం, పార్కులో చిన్నగా వ్యాహ్యాళి, కనీసం ఓ అరగంటైనా సైక్లింగ్‌... వంటి చిన్నచిన్న పనులతో(లైట్‌ ఫిజికల్‌ యాక్టివిటీ-ఎల్‌పీఏ) ఈ ప్రమాదాన్ని సులువుగా నివారించొచ్చని సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..