‘వాపు’ రహస్యం తెలిసిందోచ్‌!

కరోనాతో కోట్లాది మరణాలు చోటుచేసు కున్నాయని మనం ఇట్టే చెప్పేస్తుంటాం కానీ... నిజానికి ఆ మరణాలకి కారణం- కొవిడ్‌ కాదు, ఆ వైరస్‌ని చూసి అతిగా స్పందించిన మన రోగనిరోధక వ్యవస్థ.

Published : 26 May 2024 00:27 IST

రోనాతో కోట్లాది మరణాలు చోటుచేసు కున్నాయని మనం ఇట్టే చెప్పేస్తుంటాం కానీ... నిజానికి ఆ మరణాలకి కారణం- కొవిడ్‌ కాదు, ఆ వైరస్‌ని చూసి అతిగా స్పందించిన మన రోగనిరోధక వ్యవస్థ. దగ్గు, శ్వాస అందకపోవడం, ఊపిరితిత్తుల్లో అల్లకల్లోలం... ఇవన్నీ ఆ స్పందనలో భాగాలే. ‘సైటోకైన్‌ స్టార్మ్‌’ అనేవారు అప్పట్లో ఈ లక్షణాలని. మనం కిందపడి కాలోచేయో దెబ్బతగిలితే అక్కడ వెంటనే వాపు వస్తుంది కదా... ఇది కూడా అలాంటిదే. ఈ స్పందనలనే... స్థూలంగా ‘ఇన్‌ఫ్లమేషన్‌’(వాపు స్వభావం) అంటారు. ఓ స్థాయి వరకూ ఇది మనకు మంచే చేస్తుందికానీ- శ్రుతిమించితే మాత్రం ఎన్నో ఇబ్బందులకి కారణ మవుతుంది. అందుకే దీని రహస్యాన్ని పట్టుకోవాలని శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా చేస్తున్న పరిశోధనలు ఇప్పుడు ఓ ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నాయి. కొలంబియాకి చెందిన శాస్త్రవేత్తలు- మెదడు కాండం(బ్రెయిన్‌ స్టెమ్‌- మెడపైభాగాన్నీ మెదడునీ కలిపే భాగం)లో ఉన్న ‘సీఎన్‌ఎస్‌టీ’లోని న్యూరాన్లే ఈ ఇన్‌ఫ్లమేషన్‌ని కలిగిస్తున్నాయని కనిపెట్టారు. ఎలుకల్లో జరిగిన పరిశోధనల్లో వీటి పాత్రని స్పష్టంగా చూడగలిగారట. ఎయిర్‌కండిషనర్‌లో చల్లదనాన్ని నియంత్రించినట్టే ఇవి మన ఇన్‌ఫ్లమేషన్‌ని నియంత్రిస్తున్నాయని వాళ్ళు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..