మగవారిలో కు.ని. కోసం

కుటుంబ నియంత్రణకి సంబంధించినంత వరకూ- స్త్రీలకి ఉన్నట్టు మగవారికి బిళ్ళలు వాడుకలో లేవు. వాళ్ళకీ హార్మోన్‌ మాత్రలు తెచ్చే ప్రయత్నాలు చాలాకాలంగా జరుగుతూనే ఉన్నాయి. ఇందుకోసం ప్రాజిస్టిరాన్‌, టెస్టోస్టిరాన్‌ వంటి హార్మోన్‌లని కృత్రిమంగా సృష్టిస్తున్నారు కూడా.

Published : 09 Jun 2024 00:02 IST

కుటుంబ నియంత్రణకి సంబంధించినంత వరకూ- స్త్రీలకి ఉన్నట్టు మగవారికి బిళ్ళలు వాడుకలో లేవు. వాళ్ళకీ హార్మోన్‌ మాత్రలు తెచ్చే ప్రయత్నాలు చాలాకాలంగా జరుగుతూనే ఉన్నాయి. ఇందుకోసం ప్రాజిస్టిరాన్‌, టెస్టోస్టిరాన్‌ వంటి హార్మోన్‌లని కృత్రిమంగా సృష్టిస్తున్నారు కూడా. కానీ, వీటివల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయన్న అనుమానాలూ ప్రపంచాన్ని పీడిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే- హార్మోన్‌లతో సంబంధంలేని ఓ కొత్త పరిష్కారాన్ని కనిపెట్టారు అమెరికా టెక్సాస్‌లోని బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు. శుక్రకోశాల్లో వీర్య ఉత్పత్తికి కారణమయ్యే ‘ఎస్టీకే33’ అనే ప్రొటీన్‌ గురించి శాస్త్రవేత్తలకి ఇదివరకే అవగాహన ఉంది. తాజాగా- ఆ ప్రొటీన్‌ని నియంత్రించే ‘సీడీడీ-2807’ అనే రసాయన సమ్మేళనాన్ని(కాంపౌండ్‌)ని కనిపెట్టారు బేలర్‌ కాలేజీ శాస్త్రవేత్తలు. ఆ మందుని ఆరు మగ ఎలుకలపైన 21 రోజులు ప్రయోగించారు. వాటిల్లోని వీర్యకణాల చలనం మందగించడాన్ని గుర్తించారు. మందుని ప్రయోగించినంత కాలం మగ ఎలుకల్ని కూడిన ఆడ ఎలుకల్లో సంతానోత్పత్తి లేకపోవడాన్నీ చూశారు. మందుని ఆపగానే సంతానం కలగడాన్నీ గమనించారు. త్వరలోనే ఈ సీడీడీ-2807 మందుని కోతులపైన ప్రయోగించబోతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..