హృద్రోగ నివారణకు నారింజ తొక్క!

చిన్నప్పుడు ఈ అనుభవం మనందరికీ ఉండే ఉంటుంది- నారింజో కమలాలో... వాటి తొక్కని లోపలివైపు మడిచి మడవంగానే పైకి చిమ్మే రసాన్ని పక్కవారి కళ్ళలోకి వేసి ఆ మంటకి వాళ్ళు ‘అబ్బా’ అంటుండగా నవ్వుతూ పరుగెత్తేస్తాం.

Published : 09 Jun 2024 00:05 IST

చిన్నప్పుడు ఈ అనుభవం మనందరికీ ఉండే ఉంటుంది- నారింజో కమలాలో... వాటి తొక్కని లోపలివైపు మడిచి మడవంగానే పైకి చిమ్మే రసాన్ని పక్కవారి కళ్ళలోకి వేసి ఆ మంటకి వాళ్ళు ‘అబ్బా’ అంటుండగా నవ్వుతూ పరుగెత్తేస్తాం. కాస్త పెద్దయ్యాక- ఆ తొక్కతో చర్మానికి కొత్త మెరుపేదో వస్తుందని దాన్ని మొహానికి రుద్దుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆ రసంలోనే హృద్రోగాన్ని నివారించే గుణముందని చెబుతున్నారు అమెరికాలోని ఫ్లోరిడా వర్సిటీ శాస్త్రవేత్తలు. ముఖ్యంగా అందులో ‘ప్యురులోయల్‌ ప్యుట్రాసిన్‌’ అనే రసాయన సమ్మేళనం ఉందట. అది గుండెపోటుకి ఎలా విరుగుడుగా మారుతోందంటే- మనం తిన్న ఆహారం జీర్ణమవడానికి సూక్ష్మక్రిములు కొన్ని సాయపడుతుంటాయి. అలా సాయపడే బ్యాక్టీరియా ఒకటి... ట్రైమిథిలైన్‌-ఎన్‌-ఆక్సైడ్‌ (టీఎంఏఓ) అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంటుంది. ఈ టీఎంఏఓ ఉత్పత్తి అవసరానికన్నా ఎక్కువ ఉన్నవారిలో గుండెపోటు ప్రమాదం రెండురెట్లు ఎక్కువని ఇదివరకే గుర్తించిన శాస్త్రవేత్తలు- దాని ప్రభావాన్ని కట్టడిచేసే వివిధ పదార్థాల కోసం అన్వేషణ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా నారింజ తొక్కలోని ప్యురులోయల్‌ ప్యుట్రాసిన్‌... టీఎంఓని సమర్థంగా నిలువరిస్తుందని తేల్చారు. వెంటనే మందుల తయారీకీ నడుంబిగించేశారు కూడా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..