అనుమానం తీరలేదు

ఏంటి! ఈ మధ్యన మీ షర్ట్‌పైన ఆడవాళ్ల తలవెంట్రుకలు ఉండటంలేదు. 

Published : 03 Mar 2024 00:56 IST

భార్య: ఏంటి! ఈ మధ్యన మీ షర్ట్‌పైన ఆడవాళ్ల తలవెంట్రుకలు ఉండటంలేదు. 

భర్త: పోనీలే... ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా... నేను అలాంటివాడిని కానని... 

భార్య: ఇప్పుడే మొదలైంది. మర్యాదగా చెప్పండి. దానికి ఏం షాంపూ కొనిస్తున్నారో... 


అలవాటులో పొరపాటు

సుబ్బలక్ష్మి ఇంటికి కావలసిన సరకులు అన్నీ తీసుకున్నాక అలవాటు ప్రకారం దుకాణదారుతో ‘రేట్లు కాస్త చూసి వెయ్యండి. మేము నెలనెలా ఇక్కడే కొంటున్నాం’ అంది. ‘మా షాపు తెరిచి పదిహేను రోజులే అయింది మేడమ్‌. ఇకనుంచీ ఇక్కడే కొనండి’ చెప్పాడు దుకాణదారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..