అబద్ధం చెప్పా

మీరు చాలా అందంగా ఉన్నారండీ!

Published : 17 Mar 2024 01:05 IST

అతను: మీరు చాలా అందంగా ఉన్నారండీ!

ఆమె: థ్యాంక్స్‌ అండీ... మీరు కూడా అందంగా ఉండాల్సింది, నేనూ మిమ్మల్ని పొగిడేదాన్ని!

అతను: దానిదేముందండీ... మీరు కూడా నాలా అబద్ధం చెప్తే సరి.

ఆమె: దొంగ సచ్చినోడా!


మీకు తెలుసా?

స్పెయిన్‌ జాతీయగీతానికి ట్యూన్‌ ఉంటుంది కానీ సాహిత్యం ఉండదు. 1770ల్లో మిలిటరీ కోసం కంపోజ్‌ చేసిన ఆ ట్యూన్‌నే తర్వాత కాలంలో స్పెయిన్‌ జాతీయగీతంగా పెట్టుకుంది. బోస్నియా, కొసొవొ, శాన్‌ మారినో దేశాల జాతీయ గీతాల్లోనూ ట్యూన్‌ తప్ప పదాలుండవు.


అంతేగా!

మీపై మీ భార్యకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని అనిపిస్తే భోజనం చేసిన తరువాత చేతిని డోర్‌ కర్టెన్‌కు తుడిచి చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..