నేను లేవాలిగా

అన్ని పరీక్షలూ చేసి నీకిదే చివరి రాత్రని డాక్టర్‌ చెప్పారు సుబ్బారావ్‌కి.

Updated : 16 Apr 2024 11:08 IST

న్ని పరీక్షలూ చేసి నీకిదే చివరి రాత్రని డాక్టర్‌ చెప్పారు సుబ్బారావ్‌కి.

దుఃఖాన్ని దిగమింగుకుంటూ అన్ని విషయాలూ భార్యతో అర్ధరాత్రి వరకూ మాట్లాడుతూనే ఉన్నాడు.

అంతలోనే నిద్రలోకి జారిపోతోన్న భార్యని చూసి ‘ఓయ్‌ నిద్రపోతున్నావా’ అని అడిగాడు...

‘అవునండీ, మీరైతే ఉదయం లేవక్కర్లేదు. నేను లేవాలి కదా మరి’ అంది భార్య.


మీకెందుకు సార్‌?

న్యాయమూర్తి: ఇంట్లో మనుషులు ఉండగానే అసలు నువ్వు దొంగతనం ఎలా చేయగలిగావు?

దొంగ: సార్‌... మీకు మంచి ఉద్యోగం ఉంది. బోలెడు జీతం వస్తుంది. ఇప్పుడు దొంగతనం నేర్చుకోవాల్సిన అవసరం మీకేంటి సార్‌?


అంతేగా!

భార్యలతో వాదించడం కన్నా... వాళ్లంటే భయంతో వణికిపోతున్నట్లుగా నటించడం మేలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..