నీ కొడుకునేగా

తండ్రి: ఏరా రిజల్ట్స్‌ వచ్చినట్లున్నాయి... ఏమైంది? పాసయ్యావా?

Updated : 28 Apr 2024 06:08 IST

తండ్రి: ఏరా రిజల్ట్స్‌ వచ్చినట్లున్నాయి... ఏమైంది? పాసయ్యావా?

కొడుకు: డాక్టరు గారబ్బాయి ఫెయిలయ్యాడు. జడ్జిగారి అబ్బాయీ ఫెయిలయ్యాడు.

తండ్రి: నేను నీ సంగతి అడుగుతుంటే ఎవరి గురించో చెబుతావెందుకు?

కొడుకు: అంత గొప్ప గొప్ప వాళ్ల పిల్లలే ఫెయిలైనప్పుడు మామూలు క్లర్కువి, నీ కొడుకుని నేను పాసవుతానని ఎలా అనుకుంటావు?

ఇదీ తప్పే

భర్త: మన ఇరవైఏళ్ల సంసారంలో ఎప్పుడు చూసినా నా మాటల్లో తప్పుల్ని వెతకడం తప్ప ఇంకేమైనా చేశావా కాంతం..

భార్య: ఇరవైఏళ్లు కాదు... 21.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..