మీకు తెలుసా

మన రూపాయి బిళ్ళల్లో- దాన్ని ముద్రించిన సంవత్సరం కింద- స్టార్‌, డైమండ్‌, చుక్క ఉంటాయి గమనించారా! అవి ఆ నాణెం ఎక్కడ ముద్రించారో చెబుతాయి.

Published : 05 May 2024 00:09 IST

మన రూపాయి బిళ్ళల్లో- దాన్ని ముద్రించిన సంవత్సరం కింద- స్టార్‌, డైమండ్‌, చుక్క ఉంటాయి గమనించారా! అవి ఆ నాణెం ఎక్కడ ముద్రించారో చెబుతాయి. డైమండ్‌- ముంబయినీ, స్టార్‌- హైదరాబాద్‌నీ, చుక్క- నోయిడానీ సూచిస్తాయి. కానీ కొన్ని నాణేలు ఏ గుర్తూ లేకుండా ఖాళీగా ఉంటాయి. ఆ ఖాళీ కోల్‌కతా టంకశాల(మింట్‌కి) సూచిక! అందరూ తమ గుర్తులు పెట్టుకున్నప్పుడు కోల్‌కతా మాత్రం ఎందుకలా వదిలేస్తోందీ అంటే... మనదేశంలో అదే తొలి ముద్రణాశాలట. ఒకప్పుడు అదొక్కటే ఉండేది కాబట్టి ప్రత్యేకంగా తన ముద్రని పెట్టుకోలేదు. కానీ ఆ తర్వాత వచ్చినవి - కోల్‌కతాకంటే భిన్నమైనవని సూచించడానికి తమ ముద్రలు వాడటం మొదలుపెట్టాయి.


 ఆ రెండూ కాదు!

రాజు: నాన్నా! నేనూ, మా ఫ్రెండ్స్‌ కలిసి రేపు ట్రిప్‌కి వెళ్తున్నాం...
తండ్రి: ఇప్పుడు నా పర్మిషన్‌ అడుగుతున్నావా, లేక చెబుతున్నావా?
రాజు: ఆ రెండూ కాదు, డబ్బులు అడుగుతున్నా నాన్నా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..