నాకు కాదు...

బాస్‌ జోక్‌ చెప్పాడు... అందరూ పడీ పడీ నవ్వారు ఒక్కరు తప్ప.

Published : 12 May 2024 00:55 IST

రాజు: ‘భయపడకండి. ఏం కాదు, ఇది చిన్న ఆపరేషనే’ అని నర్సు పదే పదే చెబుతోంటే నాకు భయం పెరుగుతోంది.
రవి: ఆమె ధైర్యం చెబుతోంటే భయపడడం ఎందుకూ?
రాజు: ఆమె చెబుతున్నది నాకు కాదు, డాక్టర్‌కి...


అంత అదృష్టమా

భార్య: ఏమండీ, మీకు లాటరీలో ఒకరోజు కోటి రూపాయలు వచ్చాయి. సరిగ్గా అదేరోజు నన్నెవరో కిడ్నాప్‌ చేసి కోటి రూపాయలు డిమాండ్‌ చేశారు. అప్పుడేం చేస్తారు?
భర్త: ఒకే రోజు రెండు లాటరీలు తగిలేంత అదృష్టం నాకుందంటే చచ్చినా నమ్మను.


అత్తగారిల్లే కదా

సంక్రాంతికి వచ్చిన అల్లుడు ఉగాది దాటినా కదలలేదు. అతను రోజంతా హాల్లో కూర్చుని టీవీ చూస్తుండటంతో- అత్తగారికి డైలీ సీరియల్స్‌ చూడటం కుదరట్లేదు. చూసీ చూసీ ఒకరోజు...
అత్త: అల్లుడుగారూ, మీరొచ్చి మూడు నెలలు దాటింది. ఇంటికెప్పుడు వెళ్దామనుకుంటున్నారు?
అల్లుడు: అదేంటి, మీ అమ్మాయి మా ఇంట్లో ఇంకా ఎక్కువ రోజులే ఉంది కదా.
అత్త: నిజమే బాబూ, కానీ అది దాని అత్తగారిల్లు.
అల్లుడు: నాకు మాత్రం ఇది పరాయి ఇల్లా... అత్తగారిల్లేగా!


మార్పు

రమేశ్‌: ఏంటీ పొద్దున్నే గొడవపడుతున్నారు?
సురేశ్‌: ఏముందీ. ఈ ఆడవాళ్లను అర్థంచేసుకోవడం మన తరమా? పెళ్లవ్వగానే సిగరెట్లు మాన్పించింది. ఆ తర్వాత తాగుడు మాన్పించింది. నా స్నేహితులంతా చెడ్డవాళ్లేననీ వాళ్ల వల్లే నాకు దురలవాట్లు అయ్యాయనీ వాళ్లందరినీ దూరం పెట్టమంది. అంతా అయ్యాక ఇప్పుడు మీరసలు పెళ్లికి ముందులా లేరు, బాగా మారిపోయారు... అంటోంది.


ఉద్యోగం వచ్చింది!

బాస్‌ జోక్‌ చెప్పాడు... అందరూ పడీ పడీ నవ్వారు ఒక్కరు తప్ప.
‘నా జోక్‌ వింటే నీకు నవ్వు రాలేదా’ అడిగాడు బాస్‌.
‘నాకు ఆల్‌రెడీ ఇంకో కంపెనీలో ఉద్యోగం వచ్చింది’ చెప్పాడు ఆ ఉద్యోగి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..