అహంకరిస్తే వినాశనమే

‘‘అన్ని ఆకుల్లో నేనే శుభప్రదం. శుభానికి నేనే చిహ్నం. మిగిలినవి అమంగళం’’ అంది మామిడాకు. అప్పటినుండి అవి తలకిందులుగా వేళ్ళాడుతున్నాయి. ‘‘నేను సువాసనకు మారు పేరు. మీరు ఎందుకూ పనికిరారు...’’ అంది కరివేపాకు.

Published : 12 May 2024 00:59 IST

‘‘న్ని ఆకుల్లో నేనే శుభప్రదం. శుభానికి నేనే చిహ్నం. మిగిలినవి అమంగళం’’ అంది మామిడాకు. అప్పటినుండి అవి తలకిందులుగా వేళ్ళాడుతున్నాయి. ‘‘నేను సువాసనకు మారు పేరు. మీరు ఎందుకూ పనికిరారు...’’ అంది కరివేపాకు. కూరలో కరివేపాకు తప్పనిసరి. కానీ తినేటప్పుడు తీసిపారేస్తారు. అందుకే అవి కూరలో కరివేపాకులు. ‘‘భోజనం చేయటానికి నేనే పనికొస్తాను. మీరందరూ దండగ’’ అంటూ నీలిగింది అరిటాకు. అప్పటినుండి అన్నం తిన్న తరవాత అరిటాకు చెత్తకుండీలోకి చేరుతోంది. కంపులో బతకాల్సి వచ్చింది.
‘‘అసలు గొప్పతనం నాదే. అన్నం తిన్న తరవాత నోరు కంపు కొట్టకుండానూ తిన్నది అరిగేందుకూ అందరూ నన్నే నములుతారు...’’ అంటూ గొప్పలు పోయింది తమలపాకు. అప్పటినుండీ మొత్తం నమిలినాక మనిషి దాన్ని బయటకు ఉమ్మేయటం మొదలుపెట్టాడు. ఇక... తులసి ఆకు ఏమీ అనలేదు. అందుకే పూజలందుకుంటోంది. దేవుని పాదాల దగ్గర దానికి చోటు దొరికింది. అహంకరిస్తే ఎప్పటికైనా నాశనం తప్పదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..