మీరే డ్రాప్‌ చేయండి

రాము రోజూ ఆఫీస్‌కి ఆలస్యంగా వెళుతున్నాడు.

Published : 19 May 2024 00:08 IST

రాము రోజూ ఆఫీస్‌కి ఆలస్యంగా వెళుతున్నాడు.
బాస్‌: రోజు ఆఫీసుకు లేటుగా వస్తున్నావు... ఏం చేస్తున్నావ్‌ ఈ టైమ్‌ వరకూ బయట.
రాము: నా గర్ల్‌ ఫ్రెండ్‌ని కాలేజీలో డ్రాప్‌ చేసి వస్తున్నా సార్‌..!
బాస్‌: రేపటి నుంచి టైమ్‌కి వస్తే రా లేకపోతే ఉద్యోగం మానేయ్‌..!!
రాము: ఓకే సార్‌... రేపటి నుంచి మీ అమ్మాయిని మీరే కాలేజీలో డ్రాప్‌ చేసి రండి..!!

అన్నదానం

సన్నీ: ఏంట్రా బన్నీ, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావ్‌!
బన్నీ: ఇందాక క్లాస్‌లో అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని చెప్పారు కదా..!
సన్నీ: అవును, అయితే..?
బన్నీ: మరి నాకు అన్న లేడుగా, తమ్ముడిని దానం చేయొచ్చా అని ఆలోచిస్తున్నా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..