Weekly Horoscope: రాశిఫలం (ఏప్రిల్‌ 14 - ఏప్రిల్‌ 20)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 14 Apr 2024 00:16 IST


పనులు సకాలంలో పూర్తవుతాయి. అభివృద్ధి బాటలో పయనిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి. నలుగురినీ కలుపుకునిపోవాలి. అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి సౌమ్యంగా వ్యవహరించండి. చంచల నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఆర్థిక పరమైన జాగ్రత్తలు అవసరం. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్త వింటారు.


శుభయోగాలున్నాయి. వ్యాపారం బాగుంటుంది. యోగ్యతకు తగిన ఫలితాలు సాధిస్తారు. సమయ స్ఫూర్తితో ఆపదలనుంచి బయట పడతారు. పట్టుదలతో చేసే పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. తరచూ నిర్ణయాలు మార్చకుండా ఏకాగ్రతతో పనిచేయాలి. భూ గృహ వాహన లాభాలున్నాయి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది.


మనోబలంతో పనిచేసి సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికార లాభం సూచితం. అదృష్టయోగముంది. తగిన మానవ ప్రయత్నం చేయండి. నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చవద్దు. పక్కనే ఉండి ఇబ్బంది కలిగించేవారున్నారు. చాకచక్యంగా వ్యవహరిస్తే నష్టాల నుంచి బయటపడతారు. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభం జరుగుతుంది.  


 

ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆటంకాలు తొలగుతాయి. చేస్తున్న పనికి గుర్తింపు వస్తుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. అధికార యోగం సూచితం. ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. స్థిరచరాస్తులు వృద్ధిచెందుతాయి. కార్యాచరణతో ముందుకెళ్లండి. ఇష్టదైవాన్ని స్మరించండి, అనుకున్నది జరుగుతుంది.


ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇతరులపై ఆధారపడవద్దు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. చేతిదాకా వచ్చి ఆగిపోయినా నిరాశ చెందకుండా మరోసారి ప్రయత్నించాలి. ఇష్టదేవతను స్మరించండి, శుభం జరుగుతుంది.


ఆత్మవిశ్వాసంతో సకాలంలో పనులు పూర్తి చేయండి. దేనికీ వెనకడుగు వేయవద్దు. పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది. ఒత్తిడికి గురికావద్దు. మొహమాటంవల్ల సమస్యలు ఎదురవకుండా చూసుకోవాలి. పట్టుదలతో చేసే పనులు విజయాన్నిస్తాయి. కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా అనిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధపెట్టండి. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్త వింటారు.


వ్యాపారంలో కలిసివస్తుంది. ఆశయాలు నెర వేరతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఊహలకు పరిమితమవకుండా కార్యాచరణతో లక్ష్యాలను పూర్తిచేయాలి. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. నూతనప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా బలపడతారు. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి, మేలు జరుగుతుంది.


ఉద్యోగంలో అధికారయోగం సూచితం. బాధ్యతలను జాగ్రత్తగా పూర్తిచేసి ప్రశంసలందుకుంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. నిరుత్సాహపరిచే వారుంటారు. చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. స్థిరచరాస్తులు ఏర్పరచుకుంటారు. సానుకూల ఫలితాలు సాధించడానికి యోగ్యమైన కాలం. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు.


బ్రహ్మాండమైన శుభాలున్నాయి. ఎటుచూసినా విజయమే గోచరిస్తోంది. తగిన కార్యాచరణ రూపొందించుకుని పనిచేయాలి. ఇలాంటి అదృష్టకాలం అరుదుగా వస్తుంది. మానవ ప్రయత్నం విశేషంగా చేయండి. కృషికి రెట్టింపు ఫలితాలు సాధించవచ్చు. వ్యాపారంలో విజయాలున్నాయి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. మహాలక్ష్మి దర్శనం శుభప్రదం.


మనోబలంతో లక్ష్యాలను పూర్తిచేయండి, ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి. ధర్మమార్గంలో ధైర్యంగా ముందుకు సాగండి. ఒత్తిడి లేకుండా సకాలంలో పనులు పూర్తిచేయండి. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలు చేయవద్దు. చెడు ఊహించవద్దు. వ్యాపారంలో నష్టాలు తొలగుతాయి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది.


వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభఫలితాలు సాధించడానికి అనుకూలమైన సమయం. తగిన కార్యాచరణతో కృషిచేయండి. ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. ఉన్నత స్థితి గోచరిస్తోంది. కృషికి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో మంచి ఫలితాలున్నాయి. కుటుంబసభ్యుల సూచనలు శక్తినిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి, శాంతియుత జీవితం లభిస్తుంది.


అదృష్టఫలాలు అందుకునే సమయం. ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి. స్పష్టమైన ఆలోచనాసరళి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికారలాభం సూచితం. మిత్రభావంతో మెలగండి, వివాదాలు తొలగుతాయి. పెట్టుబడులు విశేషమైన లాభాన్నిస్తాయి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. వ్యాపారంలో తడబాటు పనికిరాదు. ఇష్టదైవాన్ని దర్శించండి, మంచి జరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..