Weekly Horoscope: రాశిఫలం (ఏప్రిల్‌ 28 - మే 04)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 28 Apr 2024 00:31 IST

 

ఆర్థికంగా శుభప్రదం. భూ, గృహ యోగాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభ చాటుతారు. శ్రమ అధికం అవుతుంది. అశ్రద్ధతో ఇబ్బందులు తప్పవు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. గతాన్ని తవ్వుకుంటే ప్రయోజనం లేదు. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఆత్మీయులు సహకరిస్తారు.  కుటుంబ సభ్యుల మద్దతు ఉంది. ఇష్టదైవాన్ని స్మరించండి.


ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకం. ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటారు. పొదుపు-మదుపు అవసరాన్ని గుర్తిస్తారు. మొహమాటం కారణంగా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణాల వాయిదా ఉత్తమం. ఇష్టదైవాన్ని స్మరించండి.


శుభాలు కలుగుతాయి. పాదం మోపిన ప్రతిరంగంలో విజయం సాధిస్తారు. అధికార యోగం సూచితం. మీదైన రంగంలో స్థిరత్వాన్ని సాధిస్తారు. సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఆదాయ మార్గాల్ని పెంచుకుంటారు. గృహ నిర్మాణం, స్థిరాస్తి కొనుగోలు గురించి ఆలోచిస్తారు. మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.


వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక దృఢత్వంతో ముందడుగు వేస్తారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల అండ లభిస్తుంది. శుక్రబలం అనుకూలంగా లేదు కాబట్టి, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త. ఇష్టదేవతారాధన శుభప్రదం.


ధనయోగం సూచితం. శుక్రగ్రహం ధన స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఏకాగ్రతతో అభీష్టం సిద్ధిస్తుంది. గ్రహదోషం సూచితం.  అపార్థాలకు తావివ్వకండి. ఒత్తిడిని అధిగమించండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కలహాలకు ఆస్కారం ఇవ్వకండి. మొహమాటం వద్దు. నవగ్రహ స్తోత్రం పఠించండి.


ధనలాభం ఉంది. అయితే, ఆ సొమ్మును ఆచితూచి ఖర్చు చేయండి. ఇతరులతో సంభాషించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి. కలహాలకు ఆస్కారం ఇవ్వకండి. గ్రహబలం తక్కువగా ఉంది కాబట్టి, ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయండి. పనులు వాయిదా వేయకండి.  వ్యాపారంలో మెలకువ అవసరం. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి.


ఉత్తమకాలం నడుస్తోంది. మంచి ఫలితాలు సాధిస్తారు. అదృష్టం వరిస్తుంది. సృజనాత్మకతతో వ్యాపార విజయాలు సాధిస్తారు. నలుగురి ప్రశంసలూ అందు కుంటారు. భూ, గృహ లాభాలు సూచితం. జాగ్రత్తపడకపోతే డబ్బు ఆవిరి అవుతుంది. రుణభారం తప్పించుకుంటారు. వారాంతంలో ఓ శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.


ఉద్యోగంలో కలిసి వస్తుంది. అధికారయోగం సూచితం. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక వృద్ధి ఉంది. నిర్ణయాల వాయిదా వద్దు. గౌరవ పురస్కారాలు అందుకుంటారు. పనుల్లో పురోగతి ఉంది. తోటివారితో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఓర్పుతో వ్యవహరించండి. దైవబలం నడిపిస్తుంది. వారాంతంలో ఓ శుభవార్త వింటారు. నవగ్రహ శ్లోకం చదువుకోవాలి.  


శుభకాలం నడుస్తోంది. అదృష్టఫలాలు అందుతాయి. నైపుణ్యాలనూ, అర్హతలనూ పెంచుకుంటూ వృత్తి ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళిక రచించుకుంటారు. కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకుంటారు. మీవల్ల నలుగురికీ మంచి జరుగుతుంది. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. శ్రీమహాలక్ష్మిని పూజించండి.


ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఆటంకాలు తొలగు తాయి. ఆశించిన ఫలితాలు లభిస్తాయి. పెద్దల ప్రోత్సాహం అందుతుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మీ అన్వేషణ ఫలిస్తుంది. పొదుపు- మదుపుతో సంపదను వృద్ధి చేసు కుంటారు. ఆత్మీయులతో విభేదాలు రావచ్చు. ఆలోచించి మాట్లాడండి. ముఖ్య విషయాల్లో మొండితనం వద్దు. ఇష్టదైవాన్ని స్మరించండి.


కృషికి తగిన ఫలితం ఉంటుంది. తోటివారి సహకారం లభిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో ధనలాభం సూచితం. మీ నడవడికతో నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. కొత్త ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. మొహమాటానికిపోతే ఆర్థిక భారం తప్పదు. బుద్ధిబలంతో అవరోధాలను అధిగమిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి.


ఏకాగ్రతతో పనిచేయండి. దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఆలోచనలు వికసిస్తాయి. కార్యసిద్ధి ఉంది. అనుకోని ఆదాయం వరిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు అందుతాయి. మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. దైవబలంతో గండాలను అధిగమిస్తారు. కష్టాల్లో మిత్రులు అండగా నిలుస్తారు. కుటుంబ ప్రోత్సాహం ఉంది. సూర్య నారాయణమూర్తిని ధ్యానించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..