Weekly Horoscope: రాశిఫలం (ఫిబ్రవరి 25 - మార్చి 2)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 03 Mar 2024 00:17 IST


అనుకూలమైన కాలం. శుభఫలితాలున్నాయి. అభీష్టాలు సిద్ధిస్తాయి. ప్రణాళిక ప్రకారం పట్టుదలతో కృషిచేయండి. ఉద్యోగంలో ఎదుగుదల గోచరిస్తోంది. గౌరవం పెరుగుతుంది. మిత్రుల సహాయసహకారాలు అందుతాయి. నూతన ఆలోచనలు శక్తినిస్తాయి. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. పలుమార్గాల్లో లాభపడతారు. ఇష్టదేవతను స్మరించండి, ఒక పని పూర్తవుతుంది.


ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శుభఫలితాన్నిస్తాయి. స్థిరత్వం ఏర్పడుతుంది. సకాలంలో పనులు ప్రారంభించండి. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థికపరమైన అభివృద్ధి ఉంది. గృహ వాహనయోగాలు సానుకూలంగా ఉన్నాయి. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. ఒక ఆపదనుంచి బయటపడతారు. ఒక ముఖ్యకార్యం పూర్తవుతుంది. ఇష్టదైవస్మరణం మేలుచేస్తుంది.


మనోబలంతో పనిచేయండి, సంకల్పం సిద్ధిస్తుంది. స్వల్ప విఘ్నాలున్నా అధైర్యపడకూడదు. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తిచేయాలి. విశేషమైన ఆర్థిక లాభాలున్నాయి. ఇతరులపై ఆధారపడవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది.


ఏకాగ్రతతో పని ప్రారంభించండి. ఎటునుంచి ఏ ఆపద పొంచివుందో తెలియదు కాబట్టి ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. మొహమాటానికి లొంగవద్దు. అపార్థాలకు తావులేకుండా మాట్లాడాలి. ఇబ్బంది కలిగించేవారు ఉంటారు. చిన్న పొరపాటు జరిగినా శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి, లక్ష్యం నెరవేరుతుంది.


ధైర్యంగా బాధ్యతలను నిర్వర్తించండి, విజయం సాధిస్తారు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అధికారులతో సున్నితంగా వ్యవహరించాలి. నిజాయతీ మిమ్మల్ని రక్షిస్తుంది. వ్యాపారపరంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి. వారం చివర్లో ఒక విజయం లభిస్తుంది. సూర్యుణ్ణి దర్శించండి, మేలు జరుగుతుంది.


ఉద్యోగంలో కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. శ్రమ ఫలిస్తుంది, క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఆశయాలు నెరవేరతాయి. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అదృష్టవంతులు అవుతారు. వ్యాపారంలో శుభయోగం ఉంది. కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తగిన సమయం. ఇష్టదైవాన్ని స్మరించండి, లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది.


శుభ ఫలితాలున్నాయి. ఆశించినది లభిస్తుంది. ధర్మదేవత అనుగ్రహ సిద్ధి కలుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ కృషి నలుగురికీ తెలుస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలను సాధిస్తారు. నూతన ఆవిష్కరణలకు ఇది యోగ్యమైన సమయం. భూ గృహ వాహనాది ఫలితాలు అనుకూలిస్తాయి. ఇష్టదేవతను దర్శించండి, మంచి జరుగుతుంది.


వ్యాపారలాభాలున్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. స్వయంకృషితో అభివృద్ధిని సాధిస్తారు. మీరు చేసే పనులు పదిమందికీ ఆదర్శవంతమవుతాయి. ఆర్థిక అభివృద్ధి విశేషంగా ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తాయి. వివాదరహితంగా వ్యవహరించండి. సహనం అవసరం. ఇష్టదేవతాస్మరణ మనోబలాన్నిస్తుంది.


శుభప్రదమైన ఫలితాలున్నాయి. ప్రతి అవకాశాన్నీ అనుకూలంగా మార్చుకోవాలి. ఏ పని ప్రారంభించినా విజయమే గోచరిస్తోంది. మంచి ఆలోచనలతో శ్రేష్ఠమైన భవిష్యత్తును ఊహించండి. తగిన ప్రణాళికలను సిద్ధం చేయండి. గొప్పవారితో సంభాషిస్తారు. గృహనిర్మాణాది కార్యాలు సత్ఫలితాన్నిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి, శుభం కలుగుతుంది.  


వ్యాపారంలో లాభాలు గోచరిస్తున్నాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి. ధర్మమార్గంలో ముందుకెళ్లాలి. నూతన ప్రయత్నాలు కలిసివస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. భవిష్యత్‌ అవసరాలకై భూసేకరణ, గృహనిర్మాణాది అంశాలపై దృష్టి పెట్టాలి. శాంతంగా వ్యవహరించాలి. ఇష్టదేవతాస్మరణ శక్తినిస్తుంది.


ఏకాగ్రతతో చేసే పనుల్లో విజయం లభిస్తుంది. కాలం వ్యతిరేకంగా ఉంది. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయండి. అపార్థాలకు అవకాశం ఉంది. ఓర్పుతో ఉండాలి. చెడు ఊహించవద్దు. దేనికీ భయపడవద్దు. మొహమాటాన్ని పక్కనపెట్టి పనిచేయండి. వ్యాపారంలో గతానుభవం మేలుచేస్తుంది. ఇంట్లోవారి సూచనలు తీసుకోవాలి. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.


ధైర్యంగా మీ పనులు ప్రారంభించండి. శుభసంకేతాలున్నాయి. ఉద్యోగంలో తోటివారి నుంచి తగిన ప్రోత్సాహం ఉంటుంది. ప్రతిభతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆపదలు తొలగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. భూలాభం సూచితం. పెట్టుబడులు విజయాన్నిస్తాయి. ఇష్టదైవాన్ని ధ్యానించండి, మనశ్శాంతి లభిస్తుంది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..