Weekly horoscope: రాశిఫలం (ఆగస్టు 6 - 12)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 06 Aug 2023 05:19 IST


ఆర్థికంగా కలిసివస్తుంది. విశేషకృషి చేయండి, ప్రయత్నబలాన్ని బట్టి ఫలితం ఉంటుంది. విభేదాలు రానివ్వద్దు. చిన్న పొరపాటు జరిగినా విఘ్నాలు ఎదురవుతాయి. మిత్రుల సలహాలు అవసరం. ఒకోసారి పరీక్షా కాలంగా అనిపిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసు కోవాలి, నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.  


శుభయోగాలున్నాయి. ఆశయం నెరవేరుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బంగారు భవిష్యత్తు లభిస్తుంది. అధికారుల అండ ఉంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. వ్యాపారంలో సత్ఫలితాలు ఉన్నాయి. అనుకున్న స్థాయికి ఎదుగుతారు. ఆవేశం పనికిరాదు. ఖర్చుల్ని తగ్గించుకోవాలి. ఇష్టదేవతను స్మరించండి, శుభవార్త వింటారు.


మనోబలంతో విజయాలు సాధిస్తారు. సకాలంలో పనులు ప్రారంభించండి. సంకల్పసిద్ధి ఉంది. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి గోచరిస్తోంది. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకోండి. సంకోచం పనికిరాదు. ఆర్థిక పరిస్థితి శుభప్రదం. నలుగురినీ కలుపుకు పోవాలి. కుటుంబసభ్యుల సూచనలు సత్ఫలితాన్నిస్తాయి. విష్ణుధ్యానం చేయండి, వారాంతంలో మంచి వార్తలు వింటారు.


ధనయోగముంది. ఆర్థికాభివృద్ధి విశేషంగా ఉంటుంది. వ్యాపారబలం పెరుగుతుంది. తగిన అవకాశాలు వస్తాయి. వాటిని వినియోగించుకోండి. మంచి నిర్ణయాలు తీసుకుని స్థిరమైన ఫలితాలు పొందడానికి తగిన సమయం. ఉద్యోగంలో సకాలంలో బాధ్యతల్ని పూర్తిచేయాలి. ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. ఒంటరిగా ఉండవద్దు. శివారాధన శ్రేయస్సునిస్తుంది.


శుభప్రదమైన ఫలితాలుంటాయి. దేనికీ తొందర పడవద్దు. కాలం మిశ్రమంగా ఉంది. అవకాశం వచ్చేంతవరకూ వేచిచూడాలి. ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి. ముందస్తు ప్రణాళికలతో విజయం లభిస్తుంది. విశేష ధన లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఇష్టదేవతారాధన కార్యసిద్ధిని ఇస్తుంది.


ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రశంసలుంటాయి. ఆశయాలు నెరవేరతాయి. పనులను మధ్యలో ఆపవద్దు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. అవరోధాలు తొలగుతాయి. పక్కదోవ పట్టించే వారున్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. ఇష్టదేవతా ధ్యానం చేయండి, శుభవార్త వింటారు.


అదృష్టయోగం సూచితం. ఎటుచూసినా విజయమే గోచరిస్తోంది. ఇంటా బయటా కలిసివస్తుంది. ఉద్యోగంలో మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుని కార్యాచరణలో పెట్టండి. భూ గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. శత్రుదోషం తొలగుతుంది. ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.


ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. మనోబలంతో పనులు పూర్తిచేయాలి. కాలానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరుల విషయాల్లో తల దూర్చవద్దు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అవసరమైన పని మాత్రమే చేయండి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. సమష్టి కృషితో విజయం సాధ్యం. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.


అనుకూలమైన కాలం. శ్రేష్ఠమైన ఫలితాలను సాధించండి. అదృష్టయోగముంది. అవసరాలకు ధనం లభిస్తుంది. పెట్టుబడులు విశేష లాభాన్ని ఇస్తాయి. భూ గృహ వాహనాది యోగాలలో కలిసి వస్తుంది. నిర్ణయాలలో కాలయాపన ఉండకూడదు. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. ఇష్టదేవతాధ్యానం శక్తినిస్తుంది.


ఆర్థికంగా అనుకూల ఫలితాలుంటాయి. కాలం మిశ్రమంగా ఉంది. మీ బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వర్తించండి. చెడు ఊహించ వద్దు. అంతా మన మంచికే అన్న ధోరణిలో ముందుకెళ్లాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మంచి తనం కాపాడుతుంది. ప్రయత్నలోపం లేకుండా చూసుకోండి. నవగ్రహశ్లోకాలు చదువుకోవడం ఉత్తమం.


ఉద్యోగ ఫలితాలు అనుకూలం. పనుల్ని వాయిదా వేయవద్దు. మానసిక స్థైర్యం అవసరం. చెడు ఊహించవద్దు. విజయం సాధిస్తామన్న పట్టుదలతో ముందుకు సాగాలి. ఆత్మీయులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆవేశపడకుండా ఆశయాలను సాధించాలి. వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఎదురవుతాయి. ఆర్థికంగా మిశ్రమకాలం. ఈశ్వరారాధన శ్రేయస్సునిస్తుంది.


మనోబలంతో పనులు ప్రారంభించండి. విజయం సాధించేవరకూ కృషిచేస్తూనే ఉండాలి. బ్రహ్మాండమైన వ్యాపారయోగం సూచితం. బంగారు భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోండి. కాలానికి తగిన విజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఖర్చులను నియంత్రించండి. కొన్ని సమస్యలు తొలగుతాయి. ఇష్టదేవతాధ్యానం శుభాన్ని కలిగిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..