Weekly Horoscope: రాశిఫలం (జనవరి 28 - ఫిబ్రవరి 3)

ఈ వారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 28 Jan 2024 03:30 IST


ఉద్యోగస్తులకు శుభఫలితాలున్నాయి. అధికార యోగముంటుంది. ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మిత్రుల సహకారంతో ఒక పని పూర్తవుతుంది. ఆత్మసంతృప్తితో చేసే పనులు అదృష్టాన్నిస్తాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇతరులపై ఆధారపడవద్దు. ఇష్టదేవతను స్మరించండి, ప్రశాంతత లభిస్తుంది.


లక్ష్మీ కటాక్షసిద్ధి ఉంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని కృషిచేయండి. గ్రహబలం తక్కువగా ఉంది, ముఖ్యకార్యాల్లో ఏకాగ్రతతో పనిచేయండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తిచేయాలి. కర్తవ్యాలను సకాలంలో నిర్వర్తించండి, ఇష్టదేవతాధ్యానం మనోబలాన్నిస్తుంది.


కొన్ని విషయాల్లో అదృష్టం కలిసివస్తుంది. మొదలు పెట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. నిర్ణయాలు తీసుకునేముందు లోతుగా ఆలోచించండి. ఆత్మీయుల సూచనలు అవసరం. లక్ష్యం సిద్ధించేవరకూ కృషి ఆపవద్దు. దృఢసంకల్పంతో ఇబ్బందులను అధిగమించాలి. సొంత విషయాలను ఇతరులతో పంచు కోవద్దు. సూర్యనారాయణ మూర్తిని స్మరించండి, శుభవార్త వింటారు.


ఉత్సాహంగా పనులు ప్రారంభించండి, ఆశించిన ఫలితాలు త్వరగా వస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధిని సాధిస్తారు. పనుల్లో స్పష్టత వస్తుంది. సంభాషణల్లో సున్నితత్వం అవసరం. వ్యాపారంలో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతిభతో పనిచేస్తే విశేష ధనలాభాలు పొందవచ్చు. ఒక ఆపదనుంచి బయటపడతారు. ఇష్టదేవతను స్మరించండి, శక్తి లభిస్తుంది.


పనుల్లో మీదైన ప్రతిభ చూపి అభివృద్ధిని సాధిస్తారు. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అధికారుల అండదండలుంటాయి. ఒక విషయంలో స్పష్టత వస్తుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకుని అమలుచేయాలి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఇష్టదేవతా స్మరణం శక్తినిస్తుంది.


ధైర్యంగా సరైన నిర్ణయాలు తీసుకుని ఆచరించాలి. అభద్రతాభావం తొలగుతుంది. బ్రహ్మాండమైన వ్యాపారయోగం సూచితం. తోటివారి నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. అధిక లాభాలు ఉంటాయి. నిరంతర సాధన విశేషమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి. విసుగు కలిగించేవారుంటారు, ఓర్పుతో వ్యవహరించాలి. ఇష్టదైవదర్శనం శుభప్రదం.


మనోబలంతో, నిర్మాణాత్మకమైన ఆలోచనలతో లక్ష్యాలను అందుకుంటారు. ఇంట్లోవారికి మీ వల్ల మేలు జరుగుతుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు గోచరిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో మీ బాధ్యతలను నిర్వర్తించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు గురి కారాదు. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. విష్ణునామాన్ని స్మరిస్తే మంచిది.


మంచి ఫలితాలున్నాయి. పనుల్లో స్పష్టత వస్తుంది. తగిన గుర్తింపు లభిస్తుంది. తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయత్నబలాన్ని బట్టి విజయాలు ఉంటాయి కాబట్టి కృషిని కొనసాగించండి. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. సత్సాంగత్యంలో నూతన విషయాలను గ్రహిస్తారు. వ్యాపార లాభాలున్నాయి. గృహ వాహన యోగాలు సత్ఫలితాన్నిస్తాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.


గౌరవప్రదమైన జీవితం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఏకాగ్రతతో కృషిని కొనసాగించండి. సంకల్పం సిద్ధిస్తుంది. అనుకున్నదే జరుగుతుంది కాబట్టి మంచిని కోరుకోవాలి. అర్హతలను పెంచుకుంటూ నూతన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మొహమాటంతో ఖర్చులు చేయకూడదు. ఇష్టదైవాన్ని స్మరించండి, ఆపదలు తొలగుతాయి.


కాలం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ధర్మబద్ధంగా ఆత్మ విశ్వాసంతో కృషిచేయండి. దేనికీ తొందరవద్దు. అడుగడుగునా ఆటంకాలు ఉంటాయి, గతానుభవంతో పనిచేయాలి. కొన్ని సంఘటనలు సహనాన్ని పరీక్షిస్తాయి. మీ వినయవిధేయతలే కాపాడుతాయి. ప్రయత్నలోపం లేకుండా కష్టపడాలి. ఇష్టదైవధ్యానంతో మంచి జరుగుతుంది.


కొత్తగా ఆలోచించండి, పలుమార్గాల్లో ఆదాయం పొందే అవకాశాలున్నాయి. పనుల్లో స్పష్టత వస్తుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. అభీష్టం నెరవేరుతుంది. ఉపద్రవాల నుంచి బయటపడతారు. దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది లభిస్తుంది. అపోహలు తొలగుతాయి. బంధుమిత్రులతో ఆనందిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. ఇష్టదైవస్మరణ మేలుచేస్తుంది.


శ్రేష్ఠమైన జీవితం లభిస్తుంది. ప్రయత్నాలు ఫలించి ఆశయాలు నెరవేరతాయి. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మదేవత అనుగ్రహం ఉంది. వ్యాపారంలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మిశ్రమకాలం. రుణ సమస్యలు ఎదురవకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యులతో కలిసి ఆనందిస్తారు. ఇష్టదేవతాస్తుతి శక్తినిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..