Weekly Horoscope: రాశిఫలం (మార్చి 24 - 30)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 24 Mar 2024 08:17 IST


 పలు మార్గాల్లో అభివృద్ధి సాధించడానికి అనుకూల మైన సమయం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శుభఫలితాలను ఇస్తాయి. ధైర్యంగా బాధ్యతలను పూర్తిచేయండి. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. సమష్టికృషి ఫలిస్తుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. ఒక ఆపద నుంచి బయటపడతారు. సూర్యనారాయణమూర్తిని స్మరిస్తే మంచిది.


కాలం అనుకూలంగా ఉంది. కర్తవ్య నిర్వహణలో ఆలస్యం వద్దు. సంకల్పం సిద్ధిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికారయోగం సూచితం. విఘ్నాలు తొలగుతాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. గృహనిర్మాణాది కార్యాలు కలిసివస్తాయి. పట్టువిడుపులతో ముందుకు సాగండి. ఇష్టదైవాన్ని స్మరించండి, మేలు జరుగుతుంది.


అదృష్టయోగముంది. సకాలంలో పనులు పూర్తిచేస్తే ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఆపదలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.


ఆర్థికంగా మంచి ఫలితాలుంటాయి. ఆపదలు తొలగుతాయి. ఉద్యోగంలో పొరపాట్లు జరగనివ్వద్దు. కొన్ని సందర్భాల్లో పరీక్షాకాలంగా అనిపించినా, ఓర్పు వహించాలి. అపార్థాలకు తావివ్వవద్దు. ఒక సమస్య నుంచి బయటపడతారు. కుటుంబసభ్యుల సూచనలు మేలుచేస్తాయి. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. నవగ్రహశ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


మనోబలంతో పనులు ప్రారంభించండి. ముందస్తు ప్రణాళికలు విజయాన్నిస్తాయి. మిశ్రమ కాలం నడుస్తోంది. విఘ్నాలు ఎదురైనా శాంతంగా ఆలోచించాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు. మిత్రుల సూచనలతో మేలు జరుగుతుంది. తొందరపాటు చర్యల వల్ల కాలం వృథా అవుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి. నవగ్రహధ్యాన శ్లోకాలు చదువుకుంటే మేలు. నవగ్రహశ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


కృషిని బట్టి ఫలితముంటుంది కాబట్టి గట్టి ప్రయత్నం చేయాలి. నిజాయతీగా పనిచేసి నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దేనికోసం ఎదురుచూస్తున్నారో అది దొరుకు తుంది. అవరోధాలను అధిగమిస్తారు. లక్ష్యసిద్ధి కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచి జరుగుతుంది. నవగ్రహశ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


శుభప్రదమైన కాలం. అదృష్టయోగముంది. ఏ పని ప్రారంభించినా విజయం లభిస్తుంది. భూ గృహ వాహనాది యోగాలు సానుకూల ఫలితాలనిస్తాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. బంగారు భవిష్యత్తును నిర్మించే కాలమిది. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. కొన్ని సమస్యలు తీరతాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.


అవసరాలకు సరిపడా ధనం అందుతుంది. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ఇబ్బందులు తొలగుతాయి. కొంత ఒత్తిడి గోచరిస్తోంది, సకాలంలో పనులు ప్రారంభించండి. వివాదాలకు దూరంగా ఉండాలి. కొందరు కావాలని ఇబ్బంది కలిగిస్తారు. శాంతంగా వ్యవహరించాలి. ఒక మెట్టు దిగైనా మన పనులు మనం చేసుకోవాలి. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది.


శుభప్రదమైన ఫలితాలుంటాయి, ప్రతి అవకాశాన్నీ సద్వినియోగపరచుకోవాలి. దూరదృష్టితో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. స్వయంకృషితో పైకివస్తారు. ఉద్యోగం బాగుంటుంది. అభివృద్ధి సాధిస్తారు. తగినంత మానవ ప్రయత్నం చేయండి. కోరుకున్నది లభిస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.


ఆర్థికాంశాలు అనుకూలం. పనిలో పురోగతి ఉంటుంది. ప్రతిభతో అధికారులను మెప్పిస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది. శత్రుదోషం తొలగుతుంది. మిత్రబలం పెరుగుతుంది. న్యాయపరమైన లాభాలున్నాయి. ధర్మం గెలిపిస్తుంది. ఆలోచనలను ఆచరణలో పెట్టండి. సమస్యలు పరిష్కారమవుతాయి. ఇతరులపై ఆధారపడవద్దు. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది.


ఏకాగ్రతతో పనులు ప్రారంభించండి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మనోబలం నడిపిస్తుంది. పనుల్ని మధ్యలో ఆపవద్దు. వ్యాపారంలో బ్రహ్మాండమైన శుభయోగం ఉంది. తోటివారి నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఎవరేమన్నా మనసుకు తీసుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈశ్వరారాధన శుభాన్నిస్తుంది.


ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సత్సంకల్పంతో అనుకున్నది సాధిస్తారు. పనులు పూర్తిచేయండి. దగ్గరివారితో విభేదాలు వద్దు. ఎవరేమన్నా మనసుకు తీసుకోకుండా సర్దుకుపోవడం మంచిది. చెడు ఊహించవద్దు. అధైర్య పడవద్దు. పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. సమష్టి నిర్ణయాలు మేలుచేస్తాయి. లక్ష్యం నెరవేరుతుంది. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది. నవగ్రహశ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..