Weekly Horoscope: రాశిఫలం (మార్చి 3 - 9)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 03 Mar 2024 00:35 IST


 

అనుకూలమైన కాలం. శుభయోగాలున్నాయి. తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ఆశయాలు సిద్ధిస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది లభిస్తుంది. పదవీలాభం సూచితం. వ్యాపారంలో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇష్ట దేవతను ధ్యానించండి, సంకల్పం సిద్ధిస్తుంది.


ఐశ్వర్య యోగముంది. పలుమార్గాల్లో ఆదాయాన్ని పొందే వీలు కనబడుతోంది. తగిన ప్రయత్నాలు చేయాలి. లక్ష్యం సిద్ధిస్తుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. గతంలో ఆగిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఉద్యోగం బాగుంటుంది. మీవల్ల కొందరికి మేలు జరుగు తుంది. వ్యాపారంలో విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది.


మనోబలంతో పనులు ప్రారంభించండి, మంచి జరుగుతుంది. పట్టుదల ముఖ్యం. అపోహలు వీడుతాయి. దూరమైనవారు దగ్గరవుతారు. పరిస్థితులు క్రమంగా సహకరిస్తాయి. కొన్ని విషయాల్లో ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగుతుంది. మీ పనితీరు ఇతరులకు ఆదర్శవంతమవుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే శుభం జరుగుతుంది.


ఒత్తిడి లేకుండా ప్రతి పనీ ఆలోచించి చేయాలి. దేనికీ తొందరపడవద్దు. వివాదాలకు దిగవద్దు. ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. ధైర్యంగా ధర్మబద్ధంగా ముందుకెళ్లాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు రాకుండా చూసుకోవాలి. గ్రహబలం సహకరించడం లేదు కాబట్టి ప్రయత్నలోపం రానివ్వద్దు. ఒక విజయం ఉంది. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది.


మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. విఘ్నాలను అధిగమించి విజయాలు సాధిస్తారు. పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించాలి. సహనంతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పక్కనే ఉండి ఇబ్బంది కలిగించేవారున్నారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రతిభే మిమ్మల్ని కాపాడుతుంది. శత్రుదోషం తొలగుతుంది. మహాలక్ష్మీ ధ్యానం శుభప్రదం.


ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. మిత్రబలంతో సత్ఫలితాలు సాధిస్తారు. పలుమార్గాల్లో విజయం గోచరిస్తోంది. మానవప్రయత్నం మానవద్దు. క్రమంగా సుస్థిరత ఏర్పడుతుంది. ధన యోగముంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. కుటుంబసభ్యులతో కలిసి ఆనందిస్తారు. లక్ష్మీధ్యానం మంచిది.


వివిధ మార్గాల్లో ఆర్థిక సంపత్తి పెంచుకోవడానికి యోగ్యమైన కాలమిది. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ వహించాలి. సాధారణ కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తిచేయాలి. నిరుత్సాహం పనికిరాదు. ధర్మదేవత అనుగ్రహ సిద్ధి సంపూర్ణంగా ఉంది. వ్యాపారంలో కృషిని పెంచాలి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మనశ్శాంతి లభిస్తుంది.


మంచికాలం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ప్రయత్నాల్లో స్పష్టత వస్తుంది. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులు కలిసివస్తాయి. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. సూర్యనారాయణమూర్తిని దర్శించండి, శుభవార్త వింటారు.


శ్రేష్ఠమైన కాలం. పనులు త్వరగా పూర్త వుతాయి. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా బలపడతారు. క్రమంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. భూ గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తును ఇస్తాయి. లక్ష్మీదేవిని దర్శిస్తే మేలు.


పనుల్లో పురోగతి ఉంటుంది. ఆశయాలు నెరవేరుతాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. వ్యాపారయోగం బాగుంది. తోటివారి సహకారం ఉంటుంది. సాధనతో సత్ఫలితాలు పొందేందుకు అనుకూలమైన సమయం. ఉద్యోగఫలితాలు మిశ్రమం. సమయస్ఫూర్తితో ఆటంకాలను అధిగమించాలి. శాంతంగా సమాధానాలివ్వాలి. శివారాధన శుభప్రదం.


పని ప్రారంభించబోయే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి స్పష్టత వచ్చాకే చేయండి. మిత్రుల సహాయం అవసరం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమఫలితాలుంటాయి. కుటుంబసభ్యులతో చెప్పి చేసే పనులు విజయం సాధిస్తాయి. ఇబ్బంది పెట్టే వ్యక్తులకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే శుభం జరుగుతుంది.


ధర్మదేవత అనుగ్రహ సిద్ధి ఉంది. ఏకాగ్రతతో పనిచేయండి. ఈర్ష్యాపరులు కావాలని అడ్డుపడుతూ ఉంటారు. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన బాధ్యతలు చేపట్టే వీలుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. బాధ్యతలతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్త వింటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..