Weekly Horoscope: రాశిఫలం (మే 19 - మే 25)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 19 May 2024 01:19 IST


గ్రహబలంలో మార్పు లేదు. అదృష్టం వరిస్తుంది. ఆర్థిక అభివృద్ధి సూచితం. వృత్తి ఉద్యోగాల్లో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొన్ని సందర్భాల్లో గుంభనంగా వ్యవహరించడం మేలు. ఎంతోకాలంగా పూర్తికాని ఓ పని కొలిక్కి వస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.


ఏకాగ్రతతో కొత్త పనులు ప్రారంభించండి. అభీష్టం సిద్ధిస్తుంది. విఘ్నాలు ఎదురవుతాయి.  ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త  కార్య క్రమాలు ఆరంభించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త. నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


అదృష్టయోగం సూచితం. లక్ష్మీకటాక్షం ఉంది. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త. పొదుపు-మదుపు చాలా ముఖ్యం. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగులు లక్ష్యాన్ని సాధిస్తారు. అవరోధాలను అధిగమించడంలో బుద్ధిబలం తోడ్పడుతుంది. బంధుమిత్రుల సహకారం అందుకుంటారు. సంప్రదింపులలో లౌక్యం ముఖ్యం. ఇష్టదైవాన్ని స్మరించండి.


అదృష్ట ఫలాలు అందుకుంటారు. కీర్తి పెరుగుతుంది. భవిష్యత్తు లాభదాయకం. ఉద్యోగంలో పదోన్నతి ఉంది. ఎంతోకాలంగా పూర్తికాని ఓ పని కొలిక్కి వస్తుంది. పిల్లల పురోగతి ఆనందాన్ని ఇస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళిక ముఖ్యం. వారం మధ్యలో ఓ ప్రాజెక్ట్‌ పూర్తవుతుంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సంప్రదింపులు అవసరం. లక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.


ఉద్యోగంలో కలిసి వస్తుంది. అన్నివిధాలా అభివృద్ధిని సాధిస్తారు. దీర్ఘకాలిక ఆశయం నెరవేరుతుంది. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. చంచలమైన నిర్ణయాలు వద్దు. ఇతరుల వ్యాఖ్యానాలు పట్టించుకోవద్దు. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇష్టదైవాన్ని స్మరించండి.


మనోబలంతో ముందుకెళ్లండి. అదృష్ట యోగం ఉంది. పెట్టుబడులు ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచితం.  ఆత్మీయుల సహకారం అందుకుంటారు. ధర్మాన్ని వదిలిపెట్టకండి. అవరోధాలు  తొలగుతాయి. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించండి. ఇష్టదైవాన్ని స్మరించండి.


కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. మనో బలం ఉత్సాహాన్నిస్తుంది. కొన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు రావచ్చు. నిర్ణయాల్లో స్థిరత్వం ముఖ్యం. మీ ఏకాగ్రతకు భంగం కలిగించే వ్యక్తులతో జాగ్రత్త. కుటుంబ సహకారం తప్పనిసరి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతగా వ్యవహరించండి. ఆర్థిక వ్యవహారాల్లో మొహమాటం వద్దు. నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


వ్యాపారయోగం శుభప్రదం. లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలిస్తాయి. నైపుణ్యాలు పెంచుకుంటారు. సప్తమ బృహస్పతి యోగం సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృథా ఖర్చులను తగ్గించండి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.


శుభయోగం ఉంది. పరిస్థితులకు తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. భూ, గృహ యోగాలున్నాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. లక్ష్మీదేవిని దర్శించుకోండి.


మీ నిర్ణయం విజయానికి బాటలు వేస్తుంది. భవిష్యత్‌ ప్రణాళికలు చాలా అవసరం. సమాజంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంప్రదించాకే ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ఏలిననాటి శని దోషం వల్ల కొన్ని అవకాశాలు వెంట్రుకవాసిలో తప్పిపోతాయి. మహాలక్ష్మిని ధ్యానించండి.


ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గ్రహ దోషం ఉంది. అన్ని విధాలుగా జాగ్రత్త పడాల్సిన సమయం. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధ్యానంతో మనసు మీద నియంత్రణ సాధించండి. అవరోధాలు తొలగుతాయి. సిబ్బందితో స్నేహంగా మెలగాలి. మిత్రులతో సంప్రదించాకే కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఉద్యోగంలో శుభ ఫలితాలు సూచితం. ప్రతిభతో నలుగురినీ మెప్పిస్తారు. పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని వైపుల నుంచీ లాభాలు ప్రవహిస్తాయి. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్య నిర్ణయాల్లో ఏకాగ్రత అవసరం. భూ, గృహ యోగాలు ఉన్నాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. కొత్త నైపుణ్యాలు పెంచు కుంటారు. పరమేశ్వర ధ్యానం శుభప్రదం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..