Weekly Horoscope: రాశిఫలం (మే 26 - జూన్‌ 1)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 26 May 2024 08:15 IST


శుభయోగాలు ఉన్నాయి. అదృష్టం వరిస్తుంది. కీలక ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక వృద్ధి సాధిస్తారు. మీ నిర్ణయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఉద్యోగులు లక్ష్యాలను సాధిస్తారు. కొన్ని విషయాల్లో వెనుకడుగు వేస్తారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. అపార్థాలకు ఆస్కారం ఉంది. లక్ష్మీదేవిని ధ్యానించండి.


ఉత్సాహంగా పనులు చేస్తారు. నిర్ణయాలు వాయిదా వేయకండి. ఉద్యోగులకు మేలు జరుగుతుంది.  ఏడు గ్రహాలూ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. కాబట్టి, ముందూవెనుకా ఆలోచించి పనులు ప్రారంభించండి. ఏకాగ్రత అవసరం. శ్రమ అధికంగా ఉంటుంది. సాంకేతిక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాలానికి తగినట్టు ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


గ్రహబలం అనుకూలం. ఉద్యోగంలో పదోన్నతి సూచితం.  జీవితంసంతృప్తికరంగా సాగుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే విజయం వరిస్తుంది. ధనలాభం సూచితం. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్తు గురించి ఆలోచించ డానికి సరైన సమయం. పట్టుదలతో బాధ్యతల్ని పూర్తి చేయండి. రియల్‌ ఎస్టేట్‌లో లాభం ఉంది. ఇష్టదైవాన్ని స్మరించాలి.


అదృష్ట యోగం ఉంది. విజయాలు వరిస్తాయి. గురుగ్రహం ప్రభావంతో పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. సమాజంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఆర్థిక స్థిరత్వం ఉంది. వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఇష్టదైవాన్ని పూజించండి.


మనోబలంతో ముందడుగు వేస్తారు.. విజయం వరిస్తుంది. కీలక నిర్ణయాల్లో వెనుకడుగు వేయవద్దు. కొత్త ఆలోచనలు అమలు చేయాలి. సంపదలు వృద్ధి చెందుతాయి. చిన్నపాటి అవరోధాలకు నిరుత్సాహం వద్దు. మిత్రుల సూచనలు మంచి చేస్తాయి. ఆత్మీయులతో విభేదాలు రావచ్చు. వారాంతంలో మంచి జరుగుతుంది. నవగ్రహాలను స్మరించండి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అష్టమంలో శుక్రుడు సౌఖ్యాన్ని ఇస్తాడు. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనల్లో స్పష్టత అవసరం. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. సూర్యభగవానుడి ధ్యానం మేలు చేస్తుంది.


ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. మనో బలాన్ని దూరం చేసుకోకండి. కుజుడి ప్రభావంతో ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. గతంలోని పెట్టుబడులు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. గ్రహదోషం వల్ల నిర్ణయాల్లో పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంది. అపోహలకు ఆస్కారం ఇవ్వకండి. అధికారుల సమక్షంలో అణకువగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


శుభయోగం నడుస్తోంది. అంతా మంచే జరుగు తుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవబలం రక్షిస్తుంది. ఇష్టకార్యం సిద్ధిస్తుంది. బుధుడి అనుగ్రహం వల్ల ఆర్థిక ప్రయోజనం పొందుతారు. మనోధైర్యం మరిన్ని విజయాలను అందిస్తుంది. ప్రశంసలు, గౌరవాలు అందుకుంటారు. నలుగురికీ¨ మేలు చేస్తారు. చంద్రుడిని ధ్యానించాలి. చంద్రుడి ధ్యాన శ్లోక కోసం క్లిక్‌ చేయండి


అనుకున్న పనులు నెరవేరుతాయి. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. సమయానికి డబ్బు అందుతుంది. శుక్రుడి వల్ల సిరిసంపదలు పెరుగుతాయి. వ్యాపారంలో అజాగ్రత్త వద్దు. ఉద్యోగ బాధ్యతల విషయంలో మరింత శ్రద్ధగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతమైన జీవితం గడుపుతారు. వారాంతంలో మేలు జరుగుతుంది. రవి ధ్యానం శుభప్రదం.  రవి ధ్యాన శ్లోకం కోసం క్లిక్‌ చేయండి


గ్రహబలం పెరిగింది. శుభకాలం మొదలైంది.  వ్యాపార విజయాలు సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసం ముఖ్యం. స్వస్థాన ప్రాప్తి ఉంది. భూ, గృహ లాభాలున్నాయి. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.


ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభిస్తారు. శుభ ఫలితాలు లభిస్తాయి. ఏకాగ్రత అవసరం. ఉద్యోగులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఇతరుల ప్రవర్తనను పట్టించుకోవద్దు. శుక్రుడి అనుగ్రహంతో వాణిజ్యపరమైన లాభాలు ఉన్నాయి. ఆటంకాలు ఎదురైనా సులభంగా అధిగమిస్తారు. ముందస్తు ప్రణాళికతో అడుగు వేస్తారు. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


వ్యాపారయోగం శుభప్రదం. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. ధనలాభం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రమ అధికమైనా ఫలితాలు ఉంటాయి. సకాలంలో పనులు పూర్తిచేసుకుంటారు. చక్కని ప్రణాళికతో ఒత్తిడిని అధిగమిస్తారు. శుక్రగ్రహ యోగం వల్ల ధనలాభం సూచితం. పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయండి. నవగ్రహ ధ్యానం చేయాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు