Weekly Horoscope: రాశిఫలం (ఫిబ్రవరి 11 - 17)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 11 Feb 2024 07:49 IST


బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. విజయావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవీయోగం సూచితం. అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. పెట్టుబడులు కలిసివస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. వ్యాపారపరంగా బుధ దోషం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. ఇష్టదేవతాధ్యానం శుభప్రదం.


సకాలంలో పనిచేస్తే కార్యసిద్ధి లభిస్తుంది. బాధ్యతలను ధైర్యంగా, జాగ్రత్తగా నిర్వర్తించండి. అసూయాపరులు విఘ్నాలు కలిగించాలని చూస్తారు. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. లక్ష్మీ కటాక్షసిద్ధి ఉంది. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. సమయస్ఫూర్తితో ఆటంకాలను అధిగమించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది.


లక్ష్యంపై దృష్టిపెట్టి ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. గ్రహాలు వ్యతిరేకస్థానాల్లో సంచరిస్తున్నాయి, ఏకాగ్రతతో పనిచేయాలి. ఒత్తిడికి గురికారాదు. అడుగడుగునా ఇబ్బంది కలిగించే పరిస్థితులుంటాయి. సంయమనంతో అధిగమించాలి. ప్రయత్నబలాన్ని బట్టి ఫలితం ఉంటుంది. కొన్ని పనులు చేతిదాకా వచ్చి ఆగుతాయి. విష్ణు సహస్రనామపఠనం శుభప్రదం.


ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. నిజాయతీగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. మౌనంగా ఉండాలి. ప్రతి పనీ ఇంట్లోవారితో చర్చించి చేయాలి. మానసికంగా దృఢంగా ఉండాలి. నిరుత్సాహం పనికిరాదు. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్ చేయండి


అదృష్టయోగముంది. పలుమార్గాల్లో విజయాలు లభిస్తాయి. స్వల్ప ప్రయత్నంతోనే విశేష లాభాలు సమకూరుతాయి. ప్రశాంత చిత్తంతో పనిచేసి లక్ష్యాలను పూర్తిచేయండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. తోటివారి సహాయసహకారాలు అందుతాయి. గృహనిర్మాణాది పనుల్లో శుభఫలితాలు ఉంటాయి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.


లక్ష్మీ కటాక్షసిద్ధి కలుగుతుంది. సంపదలు పెరుగుతాయి. విశేషంగా కృషిచేయండి. వ్యాపారంలో సకాలంలో జాగ్రత్తపడితే లాభాలు పొందవచ్చు. ఉద్యోగంలో బాగా కష్టపడాలి. తోటివారి సహకారం తీసుకోవాలి. చంచలత్వం ఇబ్బందిపెడుతుంది. శత్రుదోషం తొలగుతుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, పనుల్లో పురోగతి ఉంటుంది. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్ చేయండి


విశేష ధనలాభం గోచరిస్తోంది. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. సకాలంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థికంగా వృద్ధిచెందుతారు. మొహమాటంతో ఖర్చుల్ని
పెంచుకోకూడదు. వ్యాపారంలో కలిసివస్తుంది. ఉద్యోగంలో మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి, భూ గృహ వాహనయోగాలు ఫలిస్తాయి.


శుభఫలితాలున్నాయి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. భూలాభం సూచితం. నూతన ప్రయత్నాలు కలిసివస్తాయి. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి.
ఉత్సాహంగా నిర్ణయాలను అమలుచేయండి. మంచి భవిష్యత్తు ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారనిర్ణయాలను ఆలోచించి తీసుకోండి. ఇష్టదైవస్మరణ శక్తిని ప్రసాదిస్తుంది.


శుభయోగాలున్నాయి. ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. పలుమార్గాల్లో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మంచి ఆలోచనా
విధానంతో ముందుకు సాగాలి. ఆశించిన ధనలాభముంది. పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. విజ్ఞానపరంగా ఉన్నత స్థితికి చేరతారు. మిత్రుల అండ లభిస్తుంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.


బాధ్యతాయుతంగా సకాలంలో పనుల్ని పూర్తిచేయండి. గ్రహబలం అనుకూలించడం లేదు. ముందస్తు ప్రణాళికలు మేలుచేస్తాయి. నిర్మాణాత్మకమైన ఆలోచనలు అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలుచేస్తాయి. ఒంటరిగా ఏ పనీ చేయవద్దు. సమష్టి కృషి అవసరం. ఏ విషయంలోనూ తొందరపనికిరాదు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్ చేయండి


మనోబలంతో పనులు ప్రారంభించండి, త్వరగా పూర్తవుతాయి. ఆదాయమార్గాలు పెరుగుతాయి. కృషిని బట్టి లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలి. ఎప్పటి పనులు అప్పుడు పూర్తిచేసుకుంటూ ఆటంకాలను అధిగమించాలి. చెడు ఊహించకుండా పనిచేస్తే వ్యాపారంలో కలిసివస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే నష్టాలను నివారించవచ్చు. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్ చేయండి


అభీష్టసిద్ధి ఉంది. క్రమంగా వృద్ధిలోకి వస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆచరణాత్మకమైన కృషితో కార్యసిద్ధి లభిస్తుంది. గుర్తింపూ గౌరవం పెరుగుతాయి. వ్యాపారం కలిసివస్తుంది. తోటివారి సహకారంతో నూతన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. భూ గృహ వాహన యత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఇష్టదేవతాస్మరణ మేలుచేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..