Weekly Horoscope: రాశిఫలం (ఫిబ్రవరి 18 - 24)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 18 Feb 2024 08:43 IST


శుభఫలితాలున్నాయి. ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. మనోబలంతో లక్ష్యాలను పూర్తిచేయండి. ఉద్యోగంలో పైవారి సహాయ సహకారాలు అందుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో సమస్యలు గోచరి స్తున్నాయి. కొన్ని విషయాల్లో చూసీ చూడనట్లు ఉండాలి. శ్రీరామనామాన్ని స్మరించండి. సంతృప్తికరమైన జీవనవిధానం కొనసాగుతుంది.


ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు.ప్రయత్న బలాన్ని బట్టి విజయం లభిస్తుంది. అవసరానికి తగిన నిర్ణయాలు తీసుకుని అమలుచేయాలి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీవల్ల కొందరికి మేలు జరుగుతుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. తొందరపడి ఎవరినీ నమ్మవద్దు. ఓర్పు రక్షిస్తుంది. ఇష్టదేవతను స్మరించండి, దైవబలం ముందుకు నడిపిస్తుంది.


దైవబలంతో ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. ధర్మమార్గంలో నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. తొందర పనికిరాదు. సహనం శక్తినిస్తుంది. పరిస్థితులను చిరునవ్వుతో ఎదుర్కొనండి. మాట ఇవ్వబోయేముందు ఒక్కసారి ఆలోచించండి. శక్తికి మించి పనిచేయవద్దు. ఒంటరిగా ఉండి ఆలోచించవద్దు. ఆంజనేయ స్వామిని స్మరించండి, మేలు చేకూరుతుంది.


మనోబలంతో పనులు పూర్తిచేయాలి. కాలం మిశ్రమంగా ఉంది. ధైర్యంగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. సమస్యలను అర్థంచేసుకుంటూ పనిచేయాలి. ఇంట్లో వారి సూచనలు తీసుకోండి. ఎవరేమన్నా పట్టించు కోవద్దు. గంభీరంగా ఉండాలి. లక్ష్యసాధనే ధ్యేయంగా ముందుకెళ్లాలి. ఇతరులపై ఆధారపడవద్దు. ఈశ్వరధ్యానం శుభప్రదం.


వ్యాపారంలో లాభాలున్నాయి. సకాలంలో బాధ్యతల్ని పూర్తిచేయండి. మిత్రుల ద్వారా కొన్ని పనులు జరుగుతాయి. కృషిచేస్తే విశేషమైన గుర్తింపూ ప్రతిఫలమూ లభిస్తాయి. వివాదాలకు దిగవద్దు. కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి. ప్రయాణాల్లో జాగ్రత్త. సంతోషించే విషయం ఒకటుంది. సూర్యధ్యానం మంచిది.


ఉద్యోగంలో అదృష్టం వరిస్తుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. లక్ష్యం చేరువలోనే ఉంది. ధర్మ బద్ధంగా చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో మిత్రుల సూచనలు పనిచేస్తాయి. అసూయాపరులు నిందలు మోపాలని చూస్తారు. దూకుడు వద్దు. ధర్మం కాపాడుతుంది. విష్ణు సహస్రనామం చదవండి, శుభఫలితాలుంటాయి.


లక్ష్మీకటాక్షముంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఆర్థికంగా నూతన ప్రయత్నాలు శక్తినిస్తాయి. వ్యాపారంలోనూ శుభఫలితాలు ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే అధిక లాభాలు సమకూరతాయి. తెలివితేటలతో పెద్దల్ని మెప్పిస్తారు. బుద్ధిబలంతో ఆపద నుంచి బయటపడతారు. పెద్దలతో చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభం జరుగుతుంది.


ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలుచేస్తే ఉద్యోగంలో బాగుంటుంది. లక్ష్యం పూర్తయ్యేవరకూ పట్టు సడలరాదు. ఆటంకాలు కలిగించేవారున్నారు. ప్రణాళిక ద్వారా పనిచేస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. గృహ వాహన యోగాలు ఉన్నాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. గణపతిని ఆరాధిస్తే కార్యసిద్ధి లభిస్తుంది.


అదృష్టవంతులు అవుతారు. ఎటుచూసినా విజయమే గోచరిస్తోంది. స్వల్ప ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ఏ పని ప్రారంభించినా లాభముంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలుచేస్తాయి. చర, స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా ఉత్తమకాలం. న్యాయ పరమైన లాభాలున్నాయి. ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.


లక్ష్మీకటాక్ష సిద్ధి ఉంది. బాధ్యతాయుతంగా చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. ఒత్తిడి కలిగించే వారున్నారు. ధార్మిక చింతనతో పనిచేయండి. గ్రహదోషం అధికంగా ఉంది. ధైర్యంగా ఉండండి. మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది. కోరుకున్నదే జరుగుతుంది. మంచినే కోరుకోండి. ఎప్పటిపనులు అప్పుడే పూర్తిచేయండి. ఇష్టదైవస్మరణ మంచిది.


ఈ వారం అన్ని విషయాల్లోనూ జాగ్రత్త అవసరం. గ్రహబలం అనుకూలించడం లేదు. మానవప్రయత్నంతోనే విజయం సాధించాలి. నమ్మకం ముందుకు నడిపిస్తుంది. అతిగా ఆలోచించవద్దు. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించండి. వివాదాలకు అవకాశం ఉంది. శాంతంగా ఆలోచించాలి. కొత్త ప్రయోగాలు చేయవద్దు. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మేలు. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్ చేయండి


వ్యాపారఫలితాలు అద్భుతంగా ఉంటాయి. పలుమార్గాల్లో పైకి వస్తారు. ఉత్సాహ వంతమైన కాలమిది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వస్తు, వస్త్ర ప్రాప్తి ఉంది. భూ లాభాలున్నాయి. వివాదాలకు అతీతంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. లక్ష్మీధ్యానం చేయండి, శుభవార్త వింటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..