కళ్లతోడు...అందమంటే మీదే

కళ్లజోడు... దీని తోడు లేకుండా ఏ యువతైనా బయటికెళ్లే పరిస్థితి ఉందా? షాపింగైనా, సినిమానైనా, పార్టీ అయినా, ఫంక్షనైనా... ఆకట్టుకునే కళ్లజోడు అలంకరించకుండా ఉండదు యువత. పైగా ఎండాకాలం...

Published : 21 Apr 2018 01:35 IST

కళ్లతోడు...అందమంటే మీదే
జోడి

కళ్లజోడు... దీని తోడు లేకుండా ఏ యువతైనా బయటికెళ్లే పరిస్థితి ఉందా? షాపింగైనా, సినిమానైనా, పార్టీ అయినా, ఫంక్షనైనా... ఆకట్టుకునే కళ్లజోడు అలంకరించకుండా ఉండదు యువత. పైగా ఎండాకాలం... సూర్యుడిని సైతం కూల్‌గా చూడాలని ఆశపడతారు. అద్దాల రంగును కొందరు ఇష్టపడితే, ఫ్రేమ్‌పై ఇంకొందరు మనసుపెడతారు. చాలా మందికి తెలియదు ఏవి మన రూపానికి సరిపడతాయో? ఏదో ఒక్కటి పెట్టుకొని వెళ్తుంటారు. ఇంకొందరు ఒక అరడజను రకాలు దగ్గర పెట్టుకొని మారుస్తూ ఉంటారు. అయినా ఏదో లోపం కన్పిస్తుంటుంది. దీనికి కారణం మన రూపానికి తగిన జోడు ఎంపిక చేసుకోకపోవడమే.
ఏవి మనకు సరిపోతాయి? ఏవి మన అందాన్ని రెట్టింపు చేస్తాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే... ఈ చిత్రాలు పరిశీలించండి.
*ఎక్కువగా మన ముఖాలు చతురస్రాకారం, గుండ్రం, కోల, దీర్ఘచతురస్రాకారం, డైమండ్‌, త్రిభుజాకృతిలో ఉంటాయి. ముందుగా మన రూపం దేనికి దగ్గరగా ఉందో తెలుసుకొని అందుకు తగ్గట్లు కళ్లజోళ్లు ఎంపిక చేసుకుంటే... మీ అందం ఎన్నో కళ్లను కట్టేస్తుంది.

మీ ముఖం ఆకృతిని బట్టి వీటిని ఎంపిక చేసుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు