కళాశాలలో కునుకేద్దాం

కళాశాలకు ఎందుకెళ్తాం? ‘పిచ్చి ప్రశ్న. చదువుకోవడానికి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి......

Published : 15 Apr 2017 01:29 IST

కళాశాలలో కునుకేద్దాం

ళాశాలకు ఎందుకెళ్తాం? ‘పిచ్చి ప్రశ్న. చదువుకోవడానికి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి’ అంటారా? అయితే ఒకచోట అయితే ఎంచక్కా కునుకు కూడా తీయొచ్చు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌ ఈ అరుదైన అవకాశం కల్పిస్తోంది. దీనికోసం గ్రంథాలయాల పక్కన ఏకంగా ‘న్యాపింగ్‌ స్టేషన్‌’ అనే కునుకు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 45 నిమిషాల ‘న్యాప్‌ నుక్‌’ అనే పీరియడ్‌ను కూడా కేటాయించారు. కుర్రకారు ఈ అవకాశాన్ని బాగానే వినియోగించుకుంటున్నారట. అరవైశాతం విద్యార్థులు సరిగా నిద్రపోవడం లేదనీ, డెస్క్‌లమీదే కునికిపాట్లు పడుతున్నారని యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా పరిశోధకుల అధ్యయనంలో తేలడంతో ఈ ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సదుపాయం కావాలంటూ ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన రెండువందల మంది విద్యార్థులు సైతం సంతకాలు సేకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని