Chandrababu: ముందస్తు చర్యల వల్లే నష్టాన్ని నివారించగలిగాం: సీఎం చంద్రబాబు

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 29 Oct 2025 12:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరకులు అందించాలని సీఎం చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. తుపాను నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు సూచనలు చేశారు.

‘‘సమర్థంగా వ్యవహరించి నష్ట నివారణ చర్యలు చేపట్టాం. సీఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు అందరం టీమ్‌గా పనిచేశాం. కష్టకాలంలో బాధితుల కోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు. మరో రెండు రోజులు ఇలానే పనిచేస్తే.. మరింత ఊరట ఇవ్వగలం. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి. ప్రభుత్వం ఏం చేసిందో చెబుతూ సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవాలి. వివిధ విభాగాల్లో నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందించాలి.

తుపానును నివారించలేం.. ముందు జాగ్రత్తలతో చాలా వరకు నష్టాన్ని నివారించగలిగాం. కలెక్టర్లు, అధికారులు రియల్‌ టైమ్‌ సమాచారం తెప్పించుకున్నారు. ఎస్డీఆర్‌ఎఫ్‌, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాగా పనిచేశారు. చెట్లు కూలినా, విద్యుత్‌ తీగలు తెగిపడినా యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. మున్సిపాలిటీల్లో డ్రెయిన్ల శుభ్రం వల్ల ముంపుబారిన పడకుండా చేశాం. దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థ పునరుద్ధరణకు 10 వేల మందిని అందుబాటులో ఉంచాం. ఇవాళ మధ్యాహ్నానికి సాధారణ స్థితి ఏర్పడుతుంది. తుపాను కారణంగా ఇద్దరు చనిపోయారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. మన చర్యలతో ప్రభుత్వంపై ప్రజలకు భరోసా పెరిగింది.’’ అని చంద్రబాబు తెలిపారు.  (Andhra Pradesh News)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు