kasibugga stampede: మొదటి అంతస్తులో ఆలయం.. రెయిలింగ్‌ ఊడటంతో ప్రమాదం: హోంమంత్రి అనిత

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 01 Nov 2025 16:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

శ్రీకాకుళం: కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆలయానికి ప్రతి వారం 1500 నుంచి 2 వేల మంది భక్తులు దర్శనం కోసం వస్తారని తెలిపారు. ఆలయం మొదటి అంతస్తులో ఉంటుందని.. 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రెయిలింగ్‌ ఊడిపడిందని వివరించారు. దీంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని తెలుస్తోందన్నారు.


Tags :
Published : 01 Nov 2025 13:29 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని