Nara Lokesh: ఐదేళ్ల విధ్వంస పాలన చూసి తెలుగువారంతా ముందుకొచ్చారు: లోకేశ్‌

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 28 Jul 2025 11:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: సింగపూర్‌ అభివృద్ధి చెందిన తీరును స్ఫూర్తిగా తీసుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. సింగపూర్‌లో తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘గత ఐదేళ్ల విధ్వంస పాలన చూసి తెలుగువారంతా ముందుకొచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లోని తెలుగువారంతా ముందుకొచ్చారు. ఏదేశం వెళ్లినా సీఎం చంద్రబాబు, నేను తొలుత తెలుగువాళ్లను కలవాలని నిర్ణయించుకున్నాం. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఏర్పాటు వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. ప్రధాని మోదీ త్వరలోనే సింగపూర్‌లో పర్యటిస్తారు. మోదీ పర్యటనలోనూ తెలుగువారంతా పాల్గొని విజయవంతం చేయాలి’’ అని లోకేశ్‌ చెప్పారు.

సింగపూర్‌ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

సింగపూర్‌ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. రాజకీయాల కంటే అభివృద్ధికి ప్రాధాన్యంపై ఆ దేశం నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో ఈ పర్యటనను సద్వినియోగం చేసుకుంటామన్నారు. చంద్రబాబుతో కలిసి మంత్రులు లోకేశ్‌, నారాయణ, టీజీ భరత్‌ సింగపూర్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. (Andhra Pradesh News)

Tags :
Published : 28 Jul 2025 10:40 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని