Gandikota: 900 ఏళ్ల గండికోట కోనేరు ఎండిపోయింది!

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వైఎస్‌ఆర్‌ జిల్లాలోని గండికోటలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఎర్రకోనేరు ఎండిపోయింది. 900 ఏళ్ల చరిత్ర కలిగిన గండికోటలో ఈ కోనేరూ అంతే పురాతనమైంది.

Updated : 29 May 2024 09:03 IST

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వైఎస్‌ఆర్‌ జిల్లాలోని గండికోటలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఎర్రకోనేరు ఎండిపోయింది. 900 ఏళ్ల చరిత్ర కలిగిన గండికోటలో ఈ కోనేరూ అంతే పురాతనమైంది. తమ తాతముత్తాతల కాలం నుంచి ఈ కోనేరు ఎండిపోయిన ఆనవాళ్లు చూడలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రస్తుత కరవు పరిస్థితులకు ఈ కోనేరు అద్దంపడుతోందని పేర్కొంటున్నారు. ఈ విషయమై జిల్లా పురావస్తుశాఖ అధికారి బాలకృష్ణను వివరణ కోరగా.. వర్షాభావంతో కోనేరులో నీరు ఎండిపోయిందని, పూడికతీత, మరమ్మతు పనుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేస్తామని తెలిపారు.

న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని