Hemachandra Reddy: కూటమి గెలుపు.. మెడికల్‌ లీవ్‌లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌

వైకాపా ఓటమి చెందడంతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి మంగళవారం తన పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి శ్యామలరావుకు పంపించారు.

Updated : 05 Jun 2024 08:03 IST

కీలక దస్త్రాలు ముక్కలు ముక్కలు

ఈనాడు, అమరావతి: వైకాపా ఓటమి చెందడంతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి మంగళవారం తన పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి శ్యామలరావుకు పంపించారు. అయితే రాజీనామాను ఆమోదించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం లేకపోవడంతో శ్యామలరావు బుధవారం నుంచి ఈ నెల 19 వరకు మెడికల్‌ లీవ్‌ మంజూరు  చేశారు. ఎన్నికల ఫలితాల సరళిని చూసిన హేమచంద్రారెడ్డి ఉదయమే కొన్ని కీలక దస్త్రాలను మాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వైకాపా ఓడిపోతుందని తెలియగానే ఆయన కొన్ని దస్త్రాలను యంత్రంలో వేసి, ముక్కలుగా కట్‌ చేశారు. వాటిని చెత్తబుట్టలో వేయడంతో పాటు ప్లాస్టిక్‌ కవర్లలో దాచిపెట్టారు. అనంతరం రాజీనామా లేఖ ఇవ్వడం, ఉన్నత విద్యాశాఖ మెడికల్‌ లీవ్‌ మంజూరు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని