Amaravati: కొనసాగుతున్న రాజధాని సామగ్రి తరలింపు.. అమరావతి రైతుల ఆగ్రహం

రాజధాని అమరావతిలో విద్యుత్తు తీగల బండిళ్ల తరలింపు కొనసాగుతోంది. మంగళవారం ఓ ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ 8 బండిళ్లను 4 కంటెయినర్లలో విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురానికి తీసుకెళ్లింది.

Updated : 30 May 2024 11:06 IST

తరలిస్తున్న విద్యుత్తు తీగల బండిళ్లు

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో విద్యుత్తు తీగల బండిళ్ల తరలింపు కొనసాగుతోంది. మంగళవారం ఓ ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ 8 బండిళ్లను 4 కంటెయినర్లలో విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురానికి తీసుకెళ్లింది. ఎన్నికల ఫలితాలు రావడానికి కొద్ది రోజుల ముందు రాజధాని సామగ్రిని తరలించడం దారుణమని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది సీఎం జగన్‌ ఆడే మైండ్‌ గేమ్‌. ప్రభుత్వం కక్ష కట్టి అమరావతిలోని విద్యుత్తు ఉపకేంద్ర నిర్మాణాలను నిలిపి వేసింది. ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించడానికే రాజధానిలోని విద్యుత్తు తీగలను విశాఖకు తరలిస్తోంది. గుత్తేదారు సంస్థలు ఇష్టానుసారం రాజధాని సామగ్రిని తరలిస్తున్నారు. దీనిపై అమరావతి ఐకాసతో చర్చించి నిర్ణయ తీసుకుంటాం’ అని లింగాయపాలెంకు చెందిన రాజధాని రైతు అనుమోలు గణేష్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని