Andhra news: మా ఇంటికి రా... మహాలక్ష్మీ!

అమ్మలా ఆప్యాయతను... నాన్నలా అనురాగాన్ని కురిపించే అవకాశాన్ని ఆ భగవంతుడు తమకు కలిగించలేదనే బాధను ఆ దంపతులు దిగమింగుతున్నారు.

Published : 23 May 2024 06:47 IST

అమ్మాయిల దత్తత వైపే దంపతుల మొగ్గు 
రాష్ట్రంలో నాలుగేళ్లలో 325 మంది చిన్నారుల దత్తత
వీరిలో 186 మంది బాలికలే

ఈనాడు, అమరావతి: అమ్మలా ఆప్యాయతను... నాన్నలా అనురాగాన్ని కురిపించే అవకాశాన్ని ఆ భగవంతుడు తమకు కలిగించలేదనే బాధను ఆ దంపతులు దిగమింగుతున్నారు. విధివశాత్తూ తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులు.. అనాథలుగా మిగిలిపోకుండా చేరదీసి, మమకారాన్ని పంచేందుకు కదులుతున్నారు. దత్తత తీసుకున్న బుజ్జాయిలకు... కన్నవారికి ఏమాత్రం తీసిపోకుండా ప్రేమను పంచుతున్నారు. దత్తత తీసుకునే క్రమంలో అబ్బాయిల కంటే అమ్మాయిలవైపే దంపతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అమ్మాయి ఇంట కాలుపెడితే తమ జీవితాలకు పండగొచ్చినంత సంబరపడి పోతున్నారు. తమ నట్టింటికి సాక్షాత్తూ మహాలక్ష్మి వచ్చిందని పొంగిపోతూ... కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. చిన్నారులను దత్తత తీసుకుంటున్న వారిలో ప్రవాసులూ భారీగానే ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, యూకే, కెనడా, ఇటలీ, బెల్జియం, తదితర దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులే కాదు... ఆయా దేశాల వారూ మన చిన్నారుల్ని దత్తత తీసుకున్నారు. మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుకు చెందిన వారూ దత్తత తీసుకున్న వారిలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, సాఫ్ట్‌వేర్‌ రంగానికి చెందిన వారితోపాటు రైతులూ పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు. 

1,018 మంది ఎదురుచూపు...

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 శిశుగృహాల్లో ప్రస్తుతం 110 మంది చిన్నారులున్నారు. వీరంతా 0-6 ఏళ్లలోపు వారు. చిన్నారుల దత్తత కోసం 1,018 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని