Andhra Pradesh: ఏపీలో ఈసారీ బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్లు

వృద్ధులకు మరోసారి ఇబ్బందులు తప్పేలా లేవు. జూన్‌ 1న సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 29 May 2024 04:11 IST

వృద్ధులకు అవస్థలు తప్పనట్లే!

మే నెల ప్రారంభంలో ఓ బ్యాంకులో కిక్కిరిసిన పింఛన్‌దారులు

ఈనాడు, అమరావతి: వృద్ధులకు మరోసారి ఇబ్బందులు తప్పేలా లేవు. జూన్‌ 1న సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసే అవకాశం ఉన్నా పింఛన్‌దారులను ఇళ్ల నుంచి బయటకు రప్పించి ఏప్రిల్‌ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేసింది. మేలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి వారిని మరింత ఇబ్బందులు పెట్టింది. ఇప్పుడూ అదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. దివ్యాంగులు, నడవలేనివారు, వీల్‌ఛైర్‌లోనే ఉండేవారికి మాత్రం ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని